My title

బాలకృష్ణ వింతపోకడకు ఉద్యోగాలు వదిలేస్తున్నారు- ఆంగ్ల పత్రిక

బాలకృష్ణ. ఒక సీనియర్ నటుడు, బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే. అయినా సరే ఆయన అనైతిక ప్రవర్తన మాత్రం మారలేదు. బెల్లంకొండ సురేష్‌పై కాల్పులు జరిపి…. డాక్టర్ సర్టిఫికేట్‌తో బయటపడిన బాలకృష్ణ…. ఇప్పటికీ మనుషుల పట్ల అనుచితంగానే ప్రవర్తిస్తున్నారు. తన వద్ద పనిచేసే వారిని బహిరంగంగానే కొట్టి అవమానించడం, అభిమానుల చెంప చెళ్లుమనిపించడం కామనైపోయింది. తన బావ ముఖ్యమంత్రి కావడం, మీడియా కూడా అనుకూలం కావడంతో బాలకృష్ణ అనుచిత ప్రవర్తనను సైతం గొప్ప విషయంగా జనానికి చూపిస్తున్నారు. అయితే తాజాగా ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక బాలకృష్ణ గురించి ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది.

బాలకృష్ణ వద్ద పనిచేసేందుకు అసిస్టెంట్లు ఎవరూ ముందుకు రావడం లేదట. ప్రస్తుతం  కేఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో సి. కల్యాణ్‌ నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రంలో బాలకృష్ణ నటిస్తున్నారు.  షూటింగ్ సమయంలో బాలకృష్ణ అసిస్టెంట్‌గా ఉండేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని పత్రిక కథనం. ఇటీవల షూటింగ్ స్పాట్‌లో అందరూ చూస్తుండగానే తన బూట్లు సరిగా తుడవలేదని అసిస్టెంట్‌ను బాలకృష్ణ కొట్టి అవమానించారు. అప్పటి నుంచి ఆయనతో పనిచేసేందుకు మనుషులెవరూ ముందుకు రావడం లేదని ప్రొడక్షన్ వర్గాలు చెబుతున్నాయని వెల్లడించింది.

బాలకృష్ణకు అసిస్టెంట్‌గా ఉండాల్సిందిగా ఆదేశించడంతో కొందరు అది ఇష్టం లేక ఏకంగా కంపెనీనే వదిలి వెళ్లారని…. ఇది తమకు పెద్ద తలనొప్పిగా మారిందని ప్రొడక్షన్‌ వర్గాలు పత్రిక వద్ద వాపోయాయట. అయితే నిర్మాత సి. కల్యాణ్‌ మాత్రం…. బాలకృష్ణ వల్ల తమకు ఇబ్బంది ఏమీ లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. అసిస్టెంట్‌లు పదేపదే తప్పు చేస్తున్నప్పుడు బాలకృష్ణకు కోపం రావడంలో తప్పేమీ లేదని సి. కల్యాణ్ చెప్పారు. అయినా ఈ కాలంలో కూడా వంశం పేరు చెప్పి ఎవరి తొడను వారు కొట్టుకుంటే ఇబ్బంది లేదు గానీ…. మేం కొడుతాం బానిసల్లా పడి ఉండాలంటే ఏ వ్యక్తి అయితే పనిచేసేందుకు ముందుకొస్తారు?.

కొసమెరుపు ఏమిటంటే ఇటీవల షూటింగ్ స్పాట్ లో నిర్మాత బాలకృష్ణ దగ్గరకు వచ్చి ఖర్చులు తగ్గించుకునేందుకు ఒక షెడ్యూల్ పని దినాలని కొద్దిగా తగ్గిస్తే బాగుంటుందని సూచించాడట. దానికి మండిపడ్డ బాలకృష్ణ నిర్మాతని అందరిముందు బూతులు తిట్టాడట. ఆయనకంటే తప్పదు కాబట్టి తిట్టించుకుంటాడు కానీ…. మాకేం అవసరం? ఈ మాత్రం ఉద్యోగం బయట దొరకదా? అని చిరుద్యోగులు వాపోతున్నారు.