My title

కలెక్షన్లపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు

డీజే సినిమా వసూళ్లలో చాలామటుకు ఫేక్ అంటూ విడుదలైన మొదటి రోజు నుంచే వివాదాలు నడుస్తున్నాయి. సినిమాకు వంద కోట్లు వచ్చాయంటూ దిల్ రాజు ప్రకటించడం, అది కూడా వారం రోజుల్లో వచ్చాయని చెప్పడంతో వివాదం మరింత రాజుకుంది. దీనిపై ఇప్పటికే ఫిదా ఆడియో ఫంక్షన్ లో స్పందించిన నిర్మాత దిల్ రాజు, మరోసారి క్లారిటీ ఇచ్చాడు.

ఫిదా ప్రచారంలో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన దిల్ రాజు, కలెక్షన్ల విషయంలో తను చాలా నిక్కచ్చిగా ఉంటానంటున్నాడు. దయచేసి నన్ను నమ్మండంటూ వేడుకుంటున్నాడు.

“నిర్మాతగా ఎప్పుడు ఫేక్ కలెక్షన్స్ చెప్పడం, రాంగ్ ఫిగర్ చెప్పడం నాకు అలవాటు లేదు. సినిమా తీసి డబ్బులు రాకుండా సూపర్ హిట్ అనడం తనని తను మోసం చేసుకోవడమే అవుతుంది. నా విషయంలో అదే ఫీలవుతుంటాను. డబ్బులు రాకపోతే అది ఎంత పెద్ద సినిమా అయినా ఫ్లాపే.అందుకే సినిమా బాగోకపోతే నిర్మాతగా మీడియా ముందుకు కూడా రాను. ఒకవేళ సినిమా బాగుంటే కచ్చితంగా నిర్మాతగా నిజమైన కలెక్షన్స్ చెప్తాను. అంతే కానీ నన్ను నేను ఎప్పుడూ మోసం చేసుకోను”. దిల్ రాజు వెర్షన్ ఇది.