My title

దిల్ రాజు చేతికి పవన్-త్రివిక్రమ్ మూవీ రైట్స్

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ అంటే ఏ రేంజ్ లో హైప్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వీల్లిదరి కాంబినేషన్ లో వచ్చిన “జల్సా” , “అత్తారింటికి దారేది” సినిమా లు హిట్స్ గా నిలిచాయి. ఇక వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన “అత్తారింటికి దారేది” అయితే వన్ అఫ్ ది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ క్రేజ్ వలనే వీలిదరి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ కి బిసినెస్ పరంగా భారీ డిమాండ్ ఏర్పడింది. తాజాగా ఈ సినిమా యొక్క నైజాం హక్కుల్ని స్టార్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు రూ.29 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి సొంతం చేసుకున్నారట.

“బాహుబలి” తర్వాత మళ్ళీ హైయెస్ట్ ప్రైస్ పలికిన సినిమా ఇదే కావడం విశేషం. 2018 జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ చిత్రం కలెక్షన్ల పరంగా పరిశ్రమలో సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తుందని ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధ కృష్ణ నిర్మిస్తున్నఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తుండగా కుష్బు, బోమన్ ఇరానీ వంటి సీనియర్ నటులు లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. మరి రిలీజ్ కి ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ రిలీజ్ తరువాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.