My title

కాంగ్రెస్ నేత‌ల దెబ్బ‌కు సంక‌టంలో సోనియా

సెల్ఫ్‌గోల్ చేసుకోవ‌డంలో కాంగ్రెస్‌వాళ్లు అంద‌రిని మించిపోయిన‌ట్టున్నారు… రాష్ట్ర విభ‌జ‌న‌తో సెల్ఫ్‌గోల్ చేసుకుని ఏపీలో క‌న్నుమూసిన కాంగ్రెస్‌కు ఇప్పుడు తెలంగాణ‌లో కూడా అదే ప‌రిస్థితి రానుంది… ఏపీలో ఖేల్ ఖ‌తం..దుకాణ్ బంద్‌… ఇప్పుడు తెలంగాణ‌లో కూడా పార్టీని ఆర్పెయ్య‌డానికి హ‌స్తం నేత‌లు సెల్ఫ్ స్కెచ్ వేస్తున్నారు…. తాజాగా ఏపీలో కాంగ్రెస్ నేత‌లు చేసిన ప్ర‌తిపాద‌న ఇప్పుడు సోనియాకు ప్రాణ‌సంక‌టంగా మారింది… ఆమె ప‌రిస్థితి ముందు నుయ్యి వెన‌క గొయ్యిలా మార‌డానికి కాంగ్రెస్ నేత‌లే కార‌ణం కావ‌డం విశేషాతివిశేషం. 

నంద్యాల ఉపఎన్నిక త‌ర్వాత ఏపీలో ఇక ఎప్ప‌టికీ కోలుకోలేమ‌ని, చెయ్యి పార్టీని జ‌నం గొయ్యి తీసి పూడ్చేశార‌ని కాంగ్రెస్ వాళ్లు కంప్లీట్‌గా గ్ర‌హించారు… త‌మ పార్టీకి శాశ్వ‌త స‌మాధి క‌ట్టి శిలాఫ‌ల‌కం వేసేశార‌ని, జ‌నం త‌మ గుండెల్లోనే కాంగ్రెస్‌కు గోరీ క‌ట్టేశార‌ని పార్టీలో అర‌కొర‌గా మిగిలిన నేత‌ల‌కు పూర్తిగా జ్ఞానోద‌యం అయింది… మిణుకుమిణుకుమంటున్న కొద్దిపాటి ఆశ కూడా కొడిగ‌ట్టింది. దీంతో వాళ్లు ఓ బృహ‌త్త‌రమైన ప్లాన్ వేశారు. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన కాంగ్రెస్ స‌మావేశంలో నేత‌లు ఓ ప్ర‌తిపాద‌న తెచ్చారు…సోనియాగాంధీని, రాహుల్‌గాంధీని ఏపీకి రప్పించి విభ‌జ‌న చేసి త‌ప్పు చేశాం మ‌మ్మ‌ల్ని మ‌న్నించండి అంటూ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పించాల‌ని, వాళ్లిద్ద‌రు లెంప‌కాయ‌లు వేసుకోవాల‌ని ఆ నేత‌లు కోరారు.. విభ‌జ‌న‌పై ఆంధ్రుల ఆగ్ర‌హం చ‌ల్లారి కాంగ్రెస్‌ను క్ష‌మిస్తార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు…అయితే దీనిపై దిగ్విజ‌య్ కోప్ప‌డ్డాడు. 

ఒక‌వేళ ఏపీ కాంగ్రెస్ నేత‌లు ఈ ప్ర‌తిపాద‌న‌ను ఢిల్లీ తీసుకువెళ్లి సోనియా ముందు ఉంచితే ఆమె సంక‌టంలో ప‌డ్డ‌ట్టే… ఆమె ప‌రిస్థితి ముందు ఏపీ వెన‌క తెలంగాణ అన్న‌ట్టు త‌యార‌వుతుంది… ఏపీలో పార్టీని బ‌తికించుకోవ‌డానికి ఒక‌వేళ సోనియా ముందుకువ‌స్తే ఆ రాష్ట్రంలో పార్టీ బ‌త‌కడం ఏమోగానీ కొద్దోగొప్పో బ‌లం ఉన్న తెలంగాణ‌లో మాత్రం చ‌స్తుంది… ఏపీ జ‌నానికి ఆమె సారీ చెబితే విభ‌జ‌న చేసి త‌ప్పు చేశామ‌ని ఒప్పుకున్న‌ట్టే… దీంతో తెలంగాణ‌లో కాంగ్రెస్ నేత‌ల కాల‌ర్ ప‌ట్టుకుంటారు జ‌నం… ఇదే అవ‌కాశంగా కాంగ్రెస్‌ను అథఃపాతాళానికి తొక్కేస్తాడు కేసీఆర్‌…. ఏపీ కాంగ్రెస్ నేత‌ల ప్ర‌తిపాద‌న ఈపాటికే దిగ్విజ‌య్ ద్వారా సోనియాకు తెలిసే ఉంటుంది…. త‌మ పార్టీ నేత‌ల ప్ర‌తిపాద‌న విని ఆమె మైండ్ బ్లాంక్ అయిపోయి ఉంటుంది… తెలంగాణ‌ను పోగొట్టుకోలేక ఏపీని వ‌దులుకోలేక సోనియా స‌త‌మ‌తం అయిపోవ‌డం గ్యారంటీ.