My title

మానవ హక్కుల సంఘంపై సుప్రీం ప్రశంసలు

మాన‌వ హ‌క్కుల సంఘం చేస్తున్న కృషిని దేశ ఉన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు ప్ర‌శంసించింది. హ‌క్కుల సంఘం కృషి కారణంగా దేశంలో ప్ర‌జ‌ల‌లో మాన‌వ హ‌క్కుల ప‌ట్ల అవ‌గాహ‌న పెరుగుతుంద‌ని సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా అన్నారు. మాన‌వ హ‌క్కుల‌కు ఉల్లంఘ‌న ఏర్ప‌డుతున్న సంద‌ర్భంలో ప్ర‌జ‌లు ఫిర్యాదులు చేయ‌డంలో ముంద‌డుగు వేస్తున్నార‌ని మిశ్రా తెలిపారు.

మాన‌వ హ‌క్కుల సంఘం 24వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌సంగించిన దీప‌క్ మిశ్రా…మాన‌వ హ‌క్క‌ల సంఘం వ‌ల్ల దేశ ప్ర‌జ‌ల‌కు జ‌రుగుతున్న మేలును గుర్తుచేశారు.

గోప్య‌త హ‌క్కు మాన‌వ హ‌క్కు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయ‌న ఈ సంద‌ర్భంగా గుర్తుచేసుకున్నారు.

మాన‌వ హ‌క్కుల‌ను ఒక జీవన విధానంగా భావించాల‌ని మాన‌వ హ‌క్కుల సంఘం చైర్‌ప‌ర్స‌న్ హెచ్ ఎల్ ద‌త్తు ప్ర‌జ‌ల‌కు సూచించారు.

మాన‌వ హ‌క్కుల సంఘం చేస్తున్న కృషి  మంచి ఫ‌లితాల‌ను ఇస్తుంద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌జ‌ల్లో అస‌మాన‌త‌లు తొల‌గ‌డానికి మాన‌వ హ‌క్కుల సంఘం ఎన్నో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను చేస్తోంద‌ని ఆయ‌న అన్నారు.

మాన‌వ హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ చ‌ట్టం 1993 ప్ర‌కారం 1993 అక్టోబ‌ర్ 12న మాన‌వ హ‌క్కుల సంఘం ఏర్పాట‌యింది.