My title

నితిన్ సినిమాలో హాలీవుడ్ స్టార్

అ..ఆ లాంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తర్వాత పర్ ఫెక్ట్ మూవీ సెలక్ట్ చేసుకున్నాడు నితిన్. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నారు. దీని కోసం ఫుల్ గా మేకోవర్ కూడా అయ్యాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పేరు లై. ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతున్న లై సినిమాకు ఇప్పుడు మరో అదనపు ఆకర్షణ కూడా తోడైంది.
లై సినిమాలో హాలీవుడ్ నటుడు డాన్ బిల్జారియన్ కూడా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా వెల్లడించాడు. అంతేకాదు బిల్జారియన్ తో కలిసి దిగిన ఓ ఫొటోను కూడా పెట్టాడు. హాలీవుడ్ లో పలు ఇంగ్లిష్ సినిమాల్లో లీడ్ రోల్స్ చేశాడు బిల్జారియన్. ఈ ఎట్రాక్షన్ తో పాటు ఈరోజు మరో స్టిల్ కూడాా రిలీజ్ చేశాారు. లై సినిమా దర్శకుడు హను రాఘవపూడి పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా లై సినిమా నుంచి మరో స్టిల్ రిలీజ్ చేశారు.
మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాని రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.