My title

బాబు పోలవరం కలపై దగ్గుబాటి కామెంట్స్

పోలవరం ప్రాజెక్టు గురించి సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికరమైన అంశం చెప్పారు. ఇటీవల చంద్రబాబు పోలవరం తన కల అంటూ పదేపదే చెబుతుండడాన్ని ఆయన తప్పుపట్టారు. పోలవరం పట్ల చంద్రబాబు గతంలో వ్యవహరించిన తీరును వివరించారు. 1996లో దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో పోలవరంపై ఉన్నతస్థాయి సమావేశం జరిగిందని చెప్పారు. ఆ మీటింగ్‌లో అప్పటి మంత్రి ఎర్రన్నాయుడు కూడా పాల్గొన్నారన్నారు.

పోలవరానికి అన్ని అనుమతులు, అన్ని విధాల సాయం చేసేందుకు కేంద్రం సిద్దంగా ఉందని దేవేగౌడ చెప్పారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రాజెక్టుకు సంబంధించి నివేదిక కోరామని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని దేవేగౌడ చెప్పారన్నారు. దేవేగౌడ సూచనను అప్పట్లో చంద్రబాబు మాత్రం పట్టించుకోలేదని దగ్గుబాటి చెప్పారు. పోలవరం నిర్మాణం కోసం చంద్రబాబు ఎలాంటి వివరాలు పంపలేదన్నారు. ఆరోజు పంపి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. దేవేగౌడ ప్రధానిగాఉన్న సమయంలో చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పుతుండేవారు. కాబట్టి ఆరోజే చంద్రబాబు స్పందించి ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తిఅయ్యేదన్న మాట.