My title

మోదీ వ‌ల్లే గుజ‌రాత్ ఎన్నిక‌లు లేటా?

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌తో పాటు గుజ‌రాత్ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌వుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ హిమాచ‌ల్ షెడ్యూల్ మాత్రం ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసింది. గుజరాత్ షెడ్యూల్ పెండింగ్‌లో పెట్టింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఒత్తిడి వ‌ల్లే షెడ్యూల్ ప్ర‌క‌టించ‌లేద‌ని  కాంగ్రెస్ ఇప్పుడు కొత్త ఆరోప‌ణ‌లు చేసింది. వ‌చ్చే వారం గుజ‌రాత్ రాజ‌ధాని గాంధీన‌గ‌ర్‌లో బీజేపీ భారీ బ‌హిరంగ‌స‌భ ఏర్పాటు చేసింది. ఎన్నిక‌ల శంఖారావాన్ని పూరించేందుకు ఈ స‌భ‌ను పెద్ద ఎత్తున నిర్వ‌హిస్తోంది. ఈ స‌భ‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ హాజ‌ర‌వుతారు. గుజ‌రాత్ ఎన్నిక‌ల కోసం ఆయ‌న భారీ వ‌రాల చిట్టా ప్ర‌క‌టించ‌బోతున్నార‌ని తెలిసింది. నోటిఫికేషన్ వెలువడ్డాక మోడీ వరాలు ప్రకటిస్తే అది ఎన్నికలకోడ్ ఉల్లంఘన అవుతుంది కాబట్టి వరాల జల్లు తరువాత నోటిఫికేషన్ ప్రకటించేలా ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ పై అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకు వచ్చిందని కాంగ్రెస్ విమర్శించింది.  ఈ స‌భ కోస‌మే గుజ‌రాత్ ఎన్నిక‌ల తేదీల‌ను ఇంకా ప్ర‌క‌టించ‌లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సోమ‌వారం నిర్వ‌హించే స‌భ త‌ర్వాత డేట్లు ప్ర‌క‌టిస్తార‌ని తెలిపింది. ఎన్నిక‌ల సంఘంపై ఒత్తిడి తెచ్చి డేట్లు ప్ర‌క‌టించ‌కుండా బీజేపీ నేత‌లు చూశార‌ని ఆరోపించింది.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఎన్నిక‌ల తేదీల‌ను గురువారం ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ప్ర‌క‌టించింది. త్వ‌ర‌లో గుజ‌రాత్ ఎన్నిక‌ల తేదీలు ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపింది. హిమాచ‌ల్‌, గుజ‌రాత్ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు డిసెంబ‌ర్ 18న ఉంటుంద‌ని ఎన్నిక‌ల సంఘం చెప్పింది. ఈప్ర‌కారం గుజ‌రాత్ కూడా అదే డేట్ ఉంటుంది. ఈ లోపు ఎన్నిక‌లు నిర్వ‌హించాలి. కానీ మోదీ స‌భ త‌ర్వాత గుజరాత్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌రించాల‌ని ఎన్నిక‌ల సంఘంపై బీజేపీ నేత‌లు ఒత్తిడి తీసుకువ‌చ్చార‌ని కాంగ్రెస్ ఆరోపించింది. వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో స‌హాయ చ‌ర్య‌ల‌కు ఎన్నిక‌ల కోడ్ అడ్డురాకుండా చూడాల‌ని  ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌ని బీజేపీ ఇంత‌కుముందే కోరింది. ఈ కోరిక మేర‌కే గుజ‌రాత్ ఎన్నిక‌ల తేదీలు ప్ర‌క‌టించ‌లేద‌ని ఎన్నిక‌ల సంఘం అధికారులు అంటున్నారు.