My title

మాట్లాడలేక కూర్చుండిపోయిన సీఎం

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అస్వస్థతకు గురయ్యారు. సభలో మాట్లాడుతూ హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ప్రసంగాన్ని ఆపేసి కూర్చీలో కూర్చుండిపోయారు. దీంతో సిబ్బంది ఆందోళన చెందారు. రాజధానిలో నిర్మించనున్న మెడిసిటీ భవనానికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు అనంతరం సభలో మాట్లాడారు. వైద్యానికి అమరావతిని హబ్‌గా చేస్తామన్నారు. అమరావతికి భవిష్యత్తులో పెద్దెత్తున పెట్టుబడులు వస్తాయన్నారు. దాదాపు 20 నిమిషాల పాటు ప్రసంగించిన చంద్రబాబు హఠాత్తుగా ప్రసంగాన్ని ఆపేసి కూర్చీలో కూర్చున్నారు. దీంతో వైద్యులు వచ్చి పరిస్థితిని ఆరా తీశారు. కాసేపటి తర్వాత తిరిగి చంద్రబాబు తన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వయసు భారం, పని ఒత్తిళ్ల కారణంగా ఆయన స్వల్ప అస్వస్థతకు గురైనట్టు భావిస్తున్నారు.