My title

బాబు గారి క్విడ్ ప్రో కో

రాబోయే రోజుల్లో తెలుగు డ్వాక్రా మ‌హిళ‌లు, తెలుగు ఎన్జీవోలు, తెలుగు అర్చ‌కుల సంఘం, తెలుగు మున్సిపాలిటీ వ‌ర్క‌ర్ల సంఘం, తెలుగు పోలీసులు, తెలుగు జ‌ర్న‌లిస్టులు… ఇలా ర‌క‌ర‌కాల బోర్డులు కనిపిస్తే ఆశ్చ‌ర్య ప‌డ‌న‌క్క‌ర్లేదు అంటున్నారు మేధావులు… డ్వాక్రా మ‌హిళ‌ల‌తో మొద‌లుపెట్టి పోలీసుల దాకా అంద‌రిని టీడీపీలో చేర్పించే కార్య‌క్ర‌మం పెట్టుకున్న‌ట్టున్నారు చంద్ర‌బాబు అంటున్నారు విశ్లేష‌కులు… మీకు నేను మేలు చేస్తున్నాను కాబ‌ట్టి నాకు మీరు ఓట్లు వేయాల్సిందే అంటూ చంద్ర‌బాబు అన్ని వ‌ర్గాల‌ను భ‌య‌పెట్టి మ‌రీ టీడీపీకి అనుబంధ సంఘాలుగా మార్చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.. నేను వేసిన రోడ్ల మీద న‌డుస్తున్నారు… నేను ఇచ్చిన పెన్ష‌న్లు తీసుకుంటున్నారు… నాకు ఓట్లు వేయ‌రా అంటూ ఆమ‌ధ్య నంద్యాల‌లో ఓట‌ర్ల‌ను బ్లాక్‌మెయిల్ చేసే ధోర‌ణిలో చంద్ర‌బాబు మాట్లాడారు… దీంతో జ‌నంతో పాటు మేధావుల‌కు కూడా మ‌తి పోయింది… చంద్ర‌బాబు త‌న జేబులో డ‌బ్బు ఇస్తున్న‌ట్టు మాట్లాడ‌డంతో అంతా ఖంగు తిన్నారు… స‌ర్లే ఏదో ఎన్నిక‌ల వేడి అనుకుని అంతా స‌రిపెట్టుకుని స‌ర్దుకున్నారు…. జ‌గ‌న్ మాట‌ల‌ను పీకిపాకాన పెట్టే మీడియాబాబులు చంద్ర‌బాబు డైలాగులు మాత్రం జ‌నం చెవికి చేర‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌డంతో అంతా స‌ర్దుమ‌ణిగిపోయింది.

నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌లు ముగిశాయి.. ఇప్పుడు ఎన్నిక‌లు ఏంలేవు… అయినా తాజాగా మ‌రోసారి చంద్ర‌బాబు త‌న త‌డాఖా చూపించారు…డ్వాక్రా మ‌హిళ‌ల రుణాలు మాఫీ చేస్తాన‌ని గ‌త ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చి దాన్ని మ‌ర్చిపోయిన చంద్ర‌బాబు టీడీపీకి ఓట్లేయించే బాధ్య‌త డ్వాక్రా మ‌హిళ‌ల‌దే అంటూ వాక్రుచ్చారు… శ్రీకాకుళం వెళ్లిన ఆయ‌న.. తిండిపెట్టిన వాడిని అన్న‌దాత సుఖీభ‌వ అంటూ ఆశీర్వ‌దించాలి… డ్వాక్రా సంఘాల‌ను నేనే ప్రారంభించాను.. ప‌సుపుకుంకుమ కింద రూ. 6 వేలు ఇచ్చాను. రుణాల‌పై వ‌డ్డీ మాఫీ చేశాను… నెల‌కు 20వేల ఆదాయం వ‌చ్చేట‌ట్టు చేస్తాను…వ‌చ్చే ఎన్నిక‌ల్లో 90 ల‌క్ష‌ల‌మంది డ్వాక్రా మ‌హిళ‌లు టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి ప‌నిచేసి పార్టీని గెలిపించాలి అని బాబు కోర‌డంతో అంతా నిర్ఘాంత‌పోయారు…. ఇక డ్వాక్రా మ‌హిళ‌లు టీడీపీకి అనుబంధ సంఘంగా మారిపోతార‌ని, తెలుగు మ‌హిళ స్థానంలో తెలుగు డ్వాక్రా మ‌హిళ అని చేర్చుకోవాల‌ని సీనియ‌ర్ నేత‌లు సెటైర్లు వేస్తున్నారు…

స‌ర్కార్ సొమ్మును ఇస్తున్న చంద్ర‌బాబు ఏదో త‌న సొంత డ‌బ్బు ఇస్తున్న‌ట్టు డ‌బ్బా కొట్టుకోవ‌డంతో డ్వాక్రా మ‌హిళ‌లు బిత్త‌ర‌పోయారు…. రాబోయే ఎన్నిక‌ల్లో టీడీపీకి ఓటు వేయ‌క‌పోతే డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ఏవీ రాకుండా చేస్తాను అని కూడా బాబు బెదిరించే అవ‌కాశం ఉందంటున్నారు విశ్లేష‌కులు… అన్ని వ‌ర్గాల‌ను ఎలాగోలా నొప్పించి ఒప్పించి త‌న‌ను మెప్పించేలా చేసుకోవ‌డ‌మే బాబు స్పెషాలిటీ అంటున్నారు విశ్లేషకులు.  రేపు ఎన్జీవోల‌కు జీతం ఇస్తున్నాను, పోలీసుల‌కు జీతం ఇస్తున్నాను కాబట్టి న‌న్నే గెలిపించాలి అని బాబు అంటారేమోన‌ని ఆయా వ‌ర్గాలు హ‌డ‌లిపోతున్నాయి…ఇంకా న‌యం ఓట్లు ఉన్నాయి క‌దా అని రేపు నేర‌స్తులు, దొంగ‌ల‌ను కూడా పార్టీకి అనుబంధం చేసేస్తే ఇబ్బందులు వ‌స్తాయ‌ని తెలుగుత‌మ్ముళ్లు స‌ణుక్కుంటున్నారు…. ఆ పెద్ద‌గా ఏం తేడా ఉండ‌దులే అని పార్టీలోని సీనియ‌ర్లు అంటున్నారు… ఇదో టైప్ క్విడ్ ప్రో కో అంటున్నారు మ‌రికొంద‌రు.. బాబు మార‌లేదు… ఆత‌ని తీరు మార‌లేదు అనుకుంటున్నారు ఏపీ జ‌నం.