My title

ఎంత అవినీతి జ‌రిగినా నో కేస్‌

బారా ఖూన్ మాఫ్ అని ఉర్దూలో ఓ సామెత ఉంది…. అలాగే ఇప్పుడు ఏపీలో కేసులు మాఫ్ అని ఏలినవారు అంటున్నార‌ని విప‌క్షాలు ఆరోపిస్తున్నాయి…. త‌ప్పు చేస్తే త‌ప్పించుకోకూడ‌దంటుంది చ‌ట్టం… మేము చెప్పిన‌ట్టు చేస్తే త‌ప్పు చేసినా త‌ప్పు కాదు ఒప్పు అంటోంది బాబు స‌ర్కార్ అని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి… చ‌ట్టం క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టి…. ఏసీబీ, విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ల ముంద‌ర‌కాళ్ల‌కు పాల‌కులు బంధం వేస్తున్నార‌ని చెబుతున్నారు. ఇప్పుడు చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోదు… అధికారం చెప్పిన‌ట్టు ఆడుతుంది… చెయ్యాల్సిన ప‌ని చేయకుండా చూస్తూ కూర్చుంటుందని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఓ ప్ర‌ముఖ ప‌త్రిక‌లో క‌థ‌నం వ‌చ్చింది.

ఏపీలో పెట్టుబ‌డుల ప్రోత్సాహ‌క క‌మిటీ అని ఒక‌టి ఉంది… ఇది రాష్ట్రానికి పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించేందుకు ప్రైవేట్ సంస్థ‌లు, వ్య‌క్తులు నెల‌కొల్పే యూనిట్లు, ప‌రిశ్ర‌మ‌ల‌కు రాయితీలు, ఆర్థిక ప్ర‌యోజ‌నాలు క‌ల్పించ‌డం, భూముల‌ను త‌క్కువ ధ‌ర‌కు కేటాయించ‌డం వంటివి చేస్తూ ఉంటుంది… ఈమేర‌కు నిర్ణ‌యాలు తీసుకుంటూ ఉంటుంది…. అయితే ఈ నిర్ణ‌యాల‌ను ఏసీబీ, విజిలెన్స్ విచార‌ణ ప‌రిధి నుంచి త‌ప్పిస్తూ తాజాగా బాబు స‌ర్కార్ ఉత్త‌ర్వులు జారీ చేసింది… అంటే ఈ క‌మిటీ అస్మ‌దీయుల‌కు అడ్డ‌గోలుగా త‌క్కువ రేటుకే భూములు, ప్ర‌యోజ‌నాలు క‌ట్ట‌బెట్టి, అడ్డ‌దారిలో పెద్ద‌ల‌కు క‌మిష‌న్లు వ‌చ్చేలా చేసినా ఇక కేసులు ఉండ‌వని అర్థం అంటున్నారు విప‌క్ష నేత‌లు..ఈ నిర్ణ‌యాల్లో ఏదైనా గోల్‌మాల్ జ‌రిగింద‌ని తెలిసినా ఏసీబీ, విజిలెన్స్ కేసులు పెట్ట‌కూడ‌దు.. విచార‌ణ జ‌ర‌ప‌కూడ‌దు… అవినీతికి క‌ళ్లెం వేసే శాఖ‌ల‌కు బాబుగారు ఇలా గొళ్లెం పెట్టార‌ని, వారి ముంద‌ర కాళ్ల‌కు జీవో బంధం వేశార‌ని మేధావులు, ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి…. అవినీతి జ‌రిగినా మీరు విచార‌ణ జ‌ర‌ప‌కూడ‌దు, కేసులు పెట్ట‌కూడ‌దు అని ఏసీబీ, విజిలెన్స్ శాఖ‌ల‌కు ప్ర‌త్య‌క్షంగా ఆదేశాలు ఇచ్చి, ఇది నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మైనా మేము చెప్పిన‌ట్టే న‌డుచుకోండి అని బాబు స‌ర్కార్‌ ప‌రోక్షంగా జీవో ద్వారా చెప్పిన‌ట్టు అయింద‌ని మేధావులు ఆరోపిస్తున్నారు.