My title

ఐటమ్ సాంగ్స్ కు రెడీ అట!

నేనే రాజు నేనే మంత్రి సినిమాలో.. రానా పక్కన నటించిన కేథరిన్ త్రెసా.. అందాల ఆరబోతకు సిద్ధమన్న సిగ్నల్స్ పంపిస్తోంది. అటు కోలీవుడ్ లో .. ఇటు టాలీవుడ్ లో ఎంత ప్రయత్నించినా.. ఫస్ట్ హీరోయిన్ చాన్సెస్ అందుకోలేకపోతున్న కేథరిన్.. చాలా వరకూ సెకండ్ హీరోయిన్ కేరెక్టర్లతోనే సరిపెట్టుకుంది. ఇలా అయితే.. ఎక్కువ కాలం కెరీర్ నడిపించలేనేమో అని అనుకుంటుందో ఏమో.. కొత్తగా ఓ నిర్ణయానికి వచ్చేసింది.

తనను గ్లామర్ రోల్స్ కే వాడుకుంటున్నారన్న చింత ఏమాత్రం లేదని.. ఈ చిన్నది క్లియర్ కట్ గా తేల్చేసింది. అంటే.. తను ఉన్నది నటించేందుకే అని.. ఎలాంటి అవకాశమైనా పర్వాలేదు అనే సిగ్నల్స్ పంపినట్టే అని ఇండస్ట్రీ జనాలు అనుకుంటున్నారట. అందుకే.. ఆమెకు ఐటమ్ సాంగ్స్ చేసేందుకూ.. అవకాశాలు వస్తున్నాయట. ఇదే గనక నిజమై.. తన అందాలను కుమ్మరించేందుకు కేథరిన్ రెడీ అయితే.. ఆమె ఫ్యాన్స్ కే కాదు.. గ్లామర్ ప్రేమికులకూ పండగే.