My title

బుద్ధా వెంకన్న కామెడి సవాల్

పార్టీ ఫిరాయించిన 21 మందితో లేదంటే కనీసం ఇటీవల మంత్రులైన ఫిరాయింపుదారులతోనైనా రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాల్సిందిగా వైసీపీ సవాల్ చేస్తున్నా స్పందించని టీడీపీ నేతలు విచిత్రమైన సవాళ్లు మాత్రం బాగానే విసురుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న జగన్‌కు సవాల్ చేశారు. జగన్‌ను ఓడించేందుకు నారా లోకేష్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు.అయితే ముందు పులివెందుల స్థానానికి జగన్‌ రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధపడాలన్నారు.

జగన్ అలా రాజీనామా చేస్తే లోకేష్ వచ్చి పోటీ చేసి అక్కడ జగన్‌ను ఓడిస్తారని బుద్దా సవాల్ చేశారు. చంద్రబాబు పుట్టిన రోజును దేశదేశాల్లో ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబును ప్రజలంతా నమ్ముతున్నారన్నారు. ప్రజాసేవ చేసేందుకే లోకేష్ ఎమ్మెల్సీ అయి ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు స్వీకరించారన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో విజయవాడలో జబర్ధస్త్-2ను ప్రారంభించారని.. ఇందుకు కథ, దర్శకత్వం జగన్ అయితే నటన రోజాది అని ఎద్దేవా చేశారు.