My title

స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు

జయజానకి నాయక సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ అనే చిన్న హీరోతో సినిమా చేశాడు బోయపాటి. కానీ తన నెక్ట్స్ మూవీస్ అన్నీ స్టార్ హీరోలతోనే వస్తాయంటున్నాడు. ఈ మేరకు మహేష్, బాలకృష్ణ, చిరంజీవి లాంటి హీరోలను లైన్లో పెట్టాడు. మరోవైపు అఖిల్ తో కూడా చర్చలు జరుపుతున్నాడట. జయజానకి నాయక ప్రచారంలో భాగంగా తన అప్ కమింగ్ మూవీస్ ను వెల్లడించాడు బోయపాటి.
“చిరంజీవికి కథ రెడీగా ఉంది. కాకపోతే ఎప్పుడు చేస్తామో తెలీదు. ప్రస్తుతానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రాజెక్టుపై దృష్టిపెట్టారు. ఆ సినిమా అయిన తర్వాత చిరంజీవి ఏం చేస్తారో తెలీదు. కథ మాత్రం రెడీగా ఉంది. చిరంజీవి సినిమా అల్లు అరవింద్ నిర్మాతగా, గీతా ఆర్ట్స్ బ్యానర్ పైనే ఉంటుంది. ఇక మహేష్ బాబు సినిమా విషయానికొస్తే చాలా కొత్త జానర్ లో ట్రై చేస్తున్నాం. కాకపోతే డేట్స్ ఎక్కువ కావాలి. మహేష్ కి కూడా కథ రెడీ. మహేష్ సినిమా డిస్కషన్స్ అయిపోయాయి. కథ మాత్రం చెప్పలేదు. స్టోరీ రెడీగా ఉంది. మహేష్ ఎప్పుడంటే అప్పుడు చెబుతా. వచ్చే ఏడాది మే లేదా జూన్ లో బాలయ్య సినిమా మాత్రం కచ్చితంగా స్టార్ట్ చేస్తాం. ఇది ఎప్పుడో కమిట్ అయిన సినిమా. ఈ హీరోలందరికీ కథలు రెడీగా ఉన్నాయి. అఖిల్ నాకు చాలా క్లోజ్. అతడి కోసం కూడా స్టోరీలైన్ రెడీగా ఉంది. కాకపోతే ఎప్పుడనేది తెలీదు. టైమ్ చూసి ఎనౌన్స్ చేస్తాం. ఆర్డర్ లో అఖిల్ సినిమా ఎప్పుడొస్తుందో చెప్పలేం. అఖిల్ ఆల్ రౌండర్. పైకి క్లాస్ గా కనిపిస్తాడు కానీ ఏదైనా చేయగలడు. అఖిల్ తో సినిమా చేస్తానని మాటిచ్చాను. ఎప్పుడనేది చెప్పలేం”. తన అప్ కమింగ్ మూవీస్ పై బోయపాటి రియాక్షన్ ఇది.