My title

10 ల‌క్ష‌ల జ‌నాభాకు 3 బ్ల‌డ్ బ్యాంక్‌లు

భార‌త‌దేశంలో బ్ల‌డ్ బ్యాంక్‌ల సంఖ్య మ‌రీ త‌క్కువుగా ఉంది. దేశ వ్యాప్తంగా కేవ‌లం 2903 బ్ల‌డ్ బ్యాంకులు మాత్ర‌మే ఉన్నాయి. అంటే 10 ల‌క్ష‌ల జ‌నాభాకు 3 బ్ల‌డ్ బ్యాంక్‌లు మ‌త్ర‌మే ఉన్నాయి. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నియ‌మాల ప్ర‌కారం ఈ సంఖ్య చాలా త‌క్కువ. బీహార్ లో ఈ ప‌రిస్థితి మ‌రీ దారుణంగా  ఉంది. అక్క‌డ 10 ల‌క్ష‌ల జ‌నాభాకు ఒకే ఒక బ్ల‌డ్ బ్యాంక్ ఉన్న‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి.

బ్ల‌డ్ బ్యాంకులు ఎక్కువ‌గా ఉన్న రాష్ట్రాల‌ను చూసిన‌ట్ల‌యితే మ‌హారాష్ట్ర అగ్ర‌స్థానంలో ఉంది. అక్క‌డ 328 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఆ త‌రువాత స్థానంలో ఉత్త‌ర ప్ర‌దేశ్, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క రాష్ట్రాలు ఉన్నాయి.

పెద్ద రాష్ట్రాల్లో జ‌నాభా ప్రాతిప‌దిక‌న చూస్తే కేర‌ళ‌లో 10 ల‌క్ష‌ల జ‌నాభాకు 5 బ్ల‌డ్ బ్యాంకులున్నాయి. తెలంగాణ‌లో కూడా దాదాపుగా అలాగే ఉంది. ప‌శ్చిమబెంగాల్‌, ఉత్త‌ర ప్ర‌దేశ్‌, జార్ఖండ్‌, రాజ‌స్థాన్ వంటి పెద్ద రాష్ట్రాల్లో కూడా ప‌రిస్థితి అంత ఆశాజ‌న‌కంగా లేదు. అక్క‌డ ప్ర‌తి 10 ల‌క్ష‌ల జ‌నాభాకు కేవ‌లం 2 బ్లడ్ బ్యాంకులు మాత్ర‌మే ఉన్నాయి.

74 జిల్లాల్లో లేనే లేవు

భార‌త‌దేశంలో ఉన్న మొత్తం జిల్లాల సంఖ్య దాదాపు 600 పైనే ఉన్నాయి. అందులో 74 జిల్లాల్లో ఒక్క‌టంటే ఒక్క బ్లడ్ బ్యాంక్ కూడా లేక‌పోవ‌డం విచిత్రం. ఆయా జిల్లా యంత్రాంగం వీటిపై శ్ర‌ద్ధ పెడితే భ‌విష్య‌త్తులోనైనా అక్క‌డ బ్లడ్ బ్యాంక్‌లు నెల‌కొనే అవ‌కాశం ఉంది.

ర‌క్త సేక‌ర‌ణ కూడా త‌క్కువే…

మ‌న దేశంలో ర‌క్త సేక‌ర‌ణ కూడా అనుకున్న స్థాయిలో జ‌ర‌గ‌డం లేదు. 2013-14లో 9.94 మిలియ‌న్ల యూనిట్ల‌ను సేక‌రించ‌గా 2015-16లో ఆ సంఖ్య 10.9 మిలియ‌న్ యూనిట్ల‌కు చేరుకుంది. ఇది ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అంచ‌నాల క‌న్నా చాలా త‌క్కువగా ఉంది. ఢిల్లీలో మాత్రం అనుకున్న దాని కంటే 3 రెట్లు అధికంగా సేక‌ర‌ణ జ‌రుగుతుంది.