My title

ఏపీలో అవినీతిపై విష్ణుకుమార్‌ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ శాసనసభ పక్ష నేత, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అవినీతి తారాస్థాయికి చేరిందని మీడియా ముందు వ్యాఖ్యానించారు. అవినీతిలో ఏపీ నెంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు. రాష్ట్రంలో అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. లంచం ఇవ్వనిదే ఏ పని కూడా కావడం లేదన్నారు. ఇంత విచ్చలవిడితనం ఎందుకు పెరుగుతోందో… రాష్ట్రం ఏమైపోతోందో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కూడా రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే లంచం ఇవ్వాల్సిందేనన్నారు. సీఎంను కూడా లంచమడిగే దమ్ము, ధైర్యం అధికారుల్లో పెరిగిందన్నారు. ఇప్పటికే ఏపీ అవినీతిలో నెంబర్‌ వన్‌ అయిందని… లంచగొండితనంలోనూ భారీగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయన్నారు. అవినీతి అధికారులను ఏసీబీకి పట్టించిన వారికి రూ. 10వేల బహుమానం ఇస్తానన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో అవినీతిని నియంత్రించాలని విష్ణుకుమార్ రాజు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

18 + nineteen =