My title

“బిగ్ బాస్” ఫైనల్ ఎపిసోడ్ నాలుగు గంటలు….

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న “బిగ్ బాస్” షో తెలుగు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ ఆదివారం “బిగ్ బాస్” సీజన్ చివరి ఎపిసోడ్ ప్రసారం కానుంది. శని ఆదివారాల్లో మామూలుగా గంటన్నర మాత్రమే కనిపించే ఎన్టీఆర్ గ్రాండ్ ఫినాలే సందర్భంగా దానికి దాదాపు మూడింతల సమయం తెరపై సందడి చేయబోతున్నాడు అని టాక్. అవును ఆదివారం నాటి చివరి ఎపిసోడ్ 4 గంటలకు పైగా సాగనుంది అని సమాచారం అందింది. “బిగ్ బాస్” షో అందరి అంచనాల్ని అందుకొని సూపర్ హిట్టయిన సంధర్బంగా చివరి ఎపిసోడ్ చాలా స్పెషల్ గా ఉండేలా చూస్తోందట స్టార్ మా టీం. స్టార్టింగ్ లో హౌస్‌లోకి వచ్చిన పార్టిసిపెంట్లందరినీ మళ్లీ రప్పిస్తున్నారు “బిగ్ బాస్” టీం. ఒక్కోక్కరిపై  ఎన్టీఆర్ స్టడీ చేస్తాడట. అలా స్టడీ చేసి ఫైనల్ గా “బిగ్ బాస్” విన్నర్ ని డిసైడ్ చేస్తాడట ఎన్టీఆర్. షో సంగతి ఎలా ఉన్నా గాని ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం ఈ న్యూస్ విని ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక పొతే ఎన్టీఆర్ హీరో గా నటించిన “జై లవ కుశ” మూవీ ఇటివలే విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.