My title

‘బిగ్ బాస్’ కోసం హైదరాబాద్ లో భారీ సెట్

ఎన్టీఆర్ ప్రతి వారం ఠంచనుగా పూణె వెళ్లాల్సిందే. ఇక్కడ ఎన్ని పనులున్నా, అన్నీ పక్కనపెట్టి పూణె వెళ్లాలి. లేదంటే బిగ్ బాస్ షో ఆగిపోతుంది. పైగా భారీ రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్-పూణె అప్-అండ్-డౌన్ చేస్తున్నాడు ఎన్టీఆర్. కానీ ఎన్నాళ్లిలా..?

అందుకే సదరు టీవీ యాజమాన్యం ఎన్టీఆర్ పై దయతలచింది. బిగ్ బాస్ సెట్ ను హైదరాబాద్ లోనే నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కుదిరితే అన్నీ హంగులున్న ఓ భారీ విల్లాను అద్దెకు తీసుకోవాలని భావిస్తోంది. దీనికోసం ఇప్పటికే వేట షురూ చేశారు ఛానెల్ ప్రతినిధులు. ఒకవేళ అనుకున్న ప్రమాణాలతో విల్లా దొరక్కపోతే.. అప్పుడు సెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారన్నమాట.

అయితే ఇవన్నీ సీజన్-2 కోసం మాత్రమే. ఈ సీజన్ వరకు ఎన్టీఆర్ పూణె వెళ్లాల్సిందే. జై లవకుశ సినిమా షూటింగ్ టైమ్ లో చాలా ఇబ్బందులు ఫేస్ చేశాడు తారక్. అయితే నెక్ట్స్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే సినిమా టైమ్ కు మాత్రం అతడికి హైదరాబాద్ లోనే బిగ్ బాస్ హౌజ్ అందుబాటులోకి వస్తుంది.