My title

గూగుల్ ను నిషేధిస్తారా..? పప్పును నిషేధిస్తారా..?

చంద్రబాబు ప్రభుత్వం సోషల్‌ మీడియాపై కక్షసాధింపుకు దిగుతోందని వైసీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి మండిపడ్డారు. ఏపీలో సోషల్ మీడియాను నిషేధించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. గూగుల్‌లో ” పప్పు ఆంధ్రప్రదేశ్‌” అని టైప్ చేస్తే లోకేష్‌ ఫొటో వస్తోందని దానికి తామేం చేయాలని ప్రశ్నించారు.

పప్పు ఆంధ్రప్రదేశ్‌ అని టైప్‌ చేస్తే లోకేష్‌ ఫొటోలు వస్తున్నాయి కదా అని గూగుల్‌ను బ్యాన్‌ చేస్తారా అని నిలదీశారు. అంత దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. ఫిప్త్‌ ఎస్టేట్‌గా మారిన సోషల్ మీడియా దెబ్బకు చంద్రబాబు వణికిపోతున్నారని విమర్శించారు. అన్యాయాన్ని సోషల్‌ మీడియా లో ఖండిస్తే జీర్ణించుకోలేకపోతోందని, భావప్రకటన స్వేచ్ఛను హరించివేస్తోందన్నారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు తగినరీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.