My title

మా నాన్న మీ ద‌రిద్రాన్ని మోశాడు…..

నంద్యాల ప్ర‌చారంలో మ‌రోసారి నోరు పారేసుకున్నారు మంత్రి అఖిల‌ప్రియ‌. ఓట్ల కోసం తిప్ప‌లు ప‌డుతున్న టీడీపీ కులాల వారీగా మీటింగ్‌లు నిర్వ‌హిస్తోంది. ఆ మీటింగ్‌లు ముగిసిన త‌ర్వాత ఇప్పుడు వ‌ర్గాల వారీగా ప్లాన్‌లు మొద‌లెట్టింది. ఇందులో భాగంగా నంద్యాల గాంధీచౌక్ ద‌గ్గ‌ర కూర‌గాయ‌ల మార్కెట్‌లో వ్యాపారుల‌తో టీడీపీ స‌మావేశం నిర్వ‌హించింది.  ఈ స‌మావేశంలో మంత్రి అఖిల‌ప్రియ‌ వ్యాపారుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. మా నాన్న భూమా నాగిరెడ్డి మీ ద‌రిద్రాన్ని మోశాడని…వ్యాపారులంతా మాకే ఓటేయాల‌ని ఆమె కోరారు.

అయితే ఈ వ్యాఖ్య‌ల‌తో వ్యాపారులు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. త‌మ‌కు చేసింది ఏమీ లేక‌పోగా…త‌మ మ‌నోభావాల‌ను కించ‌ప‌రిచేలా వ్యాఖ్య‌లు చేశార‌ని వారు మండిప‌డ్డారు. మంత్రులు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి,కాల్వ శ్రీనివాసుల స‌మక్షంలోనే అఖిల‌ప్రియ ఈ వ్యాఖ్య‌లు చేశారు. అఖిల‌ప్రియ వ్యాఖ్య‌ల‌పై వ్యాపారుల‌తో పాటు టీడీపీ నేత‌లు కూడా అసంతృప్తి వ్య‌క్తం చేశారు.