My title

భ‌ట్టికి సీఎల్పీ ప‌ద‌వి?…. టీ కాంగ్రెస్ లో భారీ మార్పులు

తెలంగాణ కాంగ్రెస్‌లో భారీమార్పులు జ‌ర‌గ‌బోతున్నాయా?  సీఎల్పీ నుంచి కాంగ్రెస్ పార్టీ ప‌ద‌వుల వ‌రకు కొత్త‌వారికి అవ‌కాశం ఇస్తారా? అంటే అవున‌నే అంటున్నారు కాంగ్రెస్ నేత‌లు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్ర‌క్షాళ‌న జ‌ర‌గాల‌ని హైక‌మాండ్ భావిస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్‌ దిగ్విజ‌య్ సింగ్‌ను తొల‌గించారు. ఇప్పుడు పీసీసీతో పాటు సీఎల్పీ ప‌ద‌వుల‌ను మార్చాల‌ని కాంగ్రెస్ పెద్ద‌లు డిసైడ్ అయ్యార‌ట‌. ఇంఛార్జ్ హోదాలో తొలిసారి గాంధీభ‌వ‌న్‌కు వ‌చ్చిన కుంతియా ఈ దిశ‌గా సిగ్న‌ల్స్ పంపారు.

సీఎల్పీనేతగా ఉన్న కుందూరు జానారెడ్డిని ఆప‌ద‌వి నుంచి త‌ప్పిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి… జానారెడ్డిది ఒకే జిల్లా, ఒకే సామాజిక వ‌ర్గం. దీంతో వీరి ఇద్ద‌రిలో ఒక‌రిని మార్చాల‌ని కాంగ్రెస్ హైక‌మాండ్ నిర్ణ‌యించింది.  మ‌రోవైపు మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క పార్టీ మారుతార‌ని ఇటీవ‌ల ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఆయ‌న ఆ ప్ర‌చారాన్ని ఖండించారు. అయితే ఆయ‌న‌కు పార్టీలో కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌ని తెలుస్తోంది. సీఎల్పీ ప‌ద‌వికి భ‌ట్టికి ఇచ్చి… వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ పద‌విని మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్ కు క‌ట్ట‌బెడ‌తార‌ని తెలుస్తోంది. మొత్తానికి మూడు సామాజిక‌వ‌ర్గాల‌కు మూడు ప‌ద‌వులు ఇచ్చి స‌మ‌న్యాయం చేయాల‌ని హైక‌మాండ్ భావిస్తోంది.