My title

ఓటర్లకు డబ్బు వెదజల్లిన బాలకృష్ణ…. ఈసీకి ఫొటోలు

నటుడు బాలకృష్ణ నంద్యాల ప్రచారం వల్ల పార్టీకి మైలేజ్ ఏమో గానీ… ఆయన విచక్షణారహిత ప్రవర్తన వల్ల టీడీపీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. దండేసేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తను హోటల్‌లో బాలకృష్ణ  కొట్టారు. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదేనా బాలకృష్ణ సంస్కారం అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

ఈ ఉదంతాన్ని మరువకముందే రోడ్‌ షోలో బాలకృష్ణ చేసిన మరో ఘన కార్యం వెలుగులోకి వచ్చింది.  ఓటర్లకు బాలకృష్ణ స్వయంగా డబ్బులు పంచుతూ కెమెరాలకు దొరికిపోయారు.  తన రోడ్‌ షోలకు వచ్చిన జనానికి వాహనం మీద నుంచే బాలకృష్ణ డబ్బులు పంపిణీ చేశారు. బాలకృష్ణ డబ్బులు ఇస్తుంటే రోడ్‌ షోకు వచ్చిన వారు చేతులు చాచి ఎగబడ్డారు. ఈ దృశ్యాలు ఈసీ వరకు వెళ్లాయి. రోడ్‌ షోకు వచ్చిన ఓటర్లకు బాలకృష్ణ డబ్బులు ఇస్తున్న దృశ్యాలు స్పష్టంగా ఉండడంతో ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.