My title

మోక్షజ్ఞకి ఇష్టం లేని పని చేస్తున్న బాలకృష్ణ…!

నందమూరి కుటుంబంలో ఉన్న మూడోతరం వారసుడు మోక్షజ్ఞ, అయితే మోక్షజ్ఞ ఏ మూవీతో ఎంట్రీ ఇస్తాడు, ఎలాంటి క్యారెక్టర్ తో ఇండస్ట్రీ లోకి ఎంటర్ అవుతాడు అని నందమూరి ఫాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాని నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు మోక్షజ్ఞ ఎంట్రీ పై ఎలాంటి న్యూస్ లేదు. అప్పట్లో మాత్రం మోక్షజ్ఞ మొదటి సినిమాని బోయపాటి శ్రీను లేదా పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేస్తారు అనే వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు లేటెస్ట న్యూస్ ప్రకారం మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలకృష్ణ ఒక క్లారిటీ ఇచ్చాడు. మోక్షజ్ఞ ఎంట్రీ తప్పకుండ ఉంటుందని అయితే అది బాలకృష్ణ తీయనున్న ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రని మోక్షజ్ఞతో చేయించాలని బాలకృష్ణ ఆలోచనట. కానీ మోక్షజ్ఞకు బాలకృష్ణ ఇలా చేయడం ఇష్టం లేదట.

ఎందుకంటే మోక్షజ్ఞ ఇప్పుడే యాక్టింగ్ చేయాలనీ అనుకోవట్లేదట. మొదట తను ప్రొడ్యూసర్ గా లేదా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసి, ఆ తర్వాత నిదానంగా హీరోగా పరిచయం కావాలని అనుకుంటున్నాడు అని మోక్షజ్ఞ సన్నిహితులు అంటున్నారు. కానీ బాలయ్య మాత్రం బ్రహ్మతేజ ప్రొడక్షన్స్ పేరుతో సొంత బ్యానర్ ను రిజిస్టర్ చేసి, ఎన్టీఆర్ బయోపిక్ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నాడు. రీసెంట్ గా “నేనే రాజు నేనే మంత్రి” మూవీ తో సక్సెస్ ని అందుకున్న తేజ ఈ బయోపిక్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు.