మరో భారీ షెడ్యూల్ పూర్తిచేసిన బాలయ్య

81

హీరో బాలకృష్ణ తన కొత్త సినిమాకు సంబంధించి మరో భారీ షెడ్యూల్ పూర్తిచేశాడు. విశాఖ, అరకు ప్రాంతాల్లో 25 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన షెడ్యూల్ కు బాలయ్య ప్యాకప్ చెప్పాడు. తాజా షెడ్యూల్ తో జై సింహా సినిమాకు సంబంధించి 70శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. త్వరలోనే మరో కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అవుతుంది.

కేఎస్ రవికుమార్ డైరక్ట్ చేస్తున్న జై సింహా సినిమాను ఎట్టిపరిస్థితుల్లో సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యాడు బాలయ్య. అందుకే మరో సినిమాపై దృష్టిపెట్టకుండా.. టోటల్ కాల్షీట్లన్నీ ఈ సినిమాకే కేటాయించాడు. ఈనెలాఖరుకు షూటింగ్ పూర్తిచేసి, వచ్చేనెల మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పెట్టుకోవాలని భావిస్తున్నారు.

చిరంతన్ భట్ ఈ సినిమాకు పాటలు కంపోజ్ చేశాడు. ఆ పాటల షూటింగ్ ను హైదరాబాద్ తో పాటు దేశంలోని ఇతర లొకేషన్లలో పూర్తిచేయబోతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న జై సింహా థియేటర్లలోకి రానుంది.

NEWS UPDATES

CINEMA UPDATES