My title

పెళ్లి కాని బ్రహ్మచారి పాత్రలో బాలకృష్ణ

రీసెంట్ గా పైసా వసూల్ తో డీలా పడిపోయిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ షూటింగ్ తో బిజీ గా ఉన్నాడు. నంద‌మూరి బాల‌కృష్ణ , న‌య‌న‌తార కాంబినేష‌న్‌లో ఓ మూవీ  తెర‌కెక్కుతున్న సంగ‌తి అందరికి తెలిసిందే. ఈ మూవీని కె.ఎస్‌.ర‌వికుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే రీసెంట్ గా ఈ మూవీ కి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ మూవీ లో బాల‌కృష్ణ బ్ర‌హ్మ‌చారిగా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. 40 ఏళ్ల‌యినా ఇంకా పెళ్లి కాని పాత్ర‌లో బాల‌య్య న‌టిస్తున్నాడ‌ని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది.

అయితే ఈ మూవీ లో క‌థానాయ‌కుడు పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి ఓ కార‌ణం ఉంటుందట. తానెంత‌గానో ఇష్ట‌ప‌డిన నయనతార మ‌రో వ్య‌క్తిని పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది. ఇక ఆ అమ్మాయి జ్ఞాప‌కాల‌తో బాలకృష్ణ జీవితాన్ని గ‌డిపేస్తుంటాడ‌న్న‌మాట‌. మ‌రొకొరిని పెళ్లి చేసుకొన్న ఆమె మ‌ళ్లీ అత‌ని జీవితంలో ప్ర‌వేశిస్తే ఏం జ‌రిగింద‌న్న‌దే ఈ సినిమా క‌థ‌ అని తెలుస్తోంది.

సి.క‌ల్యాణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ మూవీ ప్ర‌స్తుతం కుంభ‌కోణంలో షూటింగ్ జ‌రుపుకొంటోంది. బాలకృష్ణకి అచ్చోచిన సంక్రాంతికి ఈ సినిమాని విడుద‌ల చేయాలని భావిస్తున్నారు మూవీ యూనిట్. ఇకపోతే కంచె, గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి చిత్రాల‌కు సంగీతం అందించిన చిరంత‌న్ భ‌ట్ ఈ మూవీ కి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు.