My title

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కారు చోరీ

దేశ రాజధానిలో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బ్లూ వేగన్ ఆర్ కారు చోరీకి గురైంది. స‌చివాల‌యం ప్రాంగ‌ణంలోనే ముఖ్య‌మంత్రి కారు చోరీకి గురికావ‌డం సంచ‌ల‌నం రేపింది. కేజ్రీవాల్ బ్లూ వేగన్ ఆర్ కారుని ప్ర‌స్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వాలంటీర్లు ఉప‌యోగిస్తున్నార‌ని తెలిసింది. గురువారం మధ్యాహ్నం 2 గంట‌ల ప్రాంతంలో ఆ కారును ఎవరో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి చోరీ చేశాడ‌ని తెలుస్తోంది. బ్లూ వేగన్ ఆర్ కారుతో కేజ్రీవాల్‌కు చాలా అనుబంధం ఉంది. ఈ కారు వ‌చ్చిన త‌ర్వాతే త‌న ఫేట్ మారింద‌ని కేజ్రీవాల్ చెప్పార‌ట‌. అయితే కేజ్రీవాల్ కారు చోరీపై స‌చివాల‌య భ‌ద్ర‌తాధికారులు ఇంత‌వ‌ర‌కూ ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కారు కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. దొంగ‌ల కోసం ఢిల్లీ మొత్తం గాలిస్తున్నారు.