My title

ఇన్‌సిగ్నిఫికెంట్ మ్యాన్‌…. అర‌వింద్ కేజ్రీవాల్‌

అమెరికాలో ఓ ప్ర‌ముఖ మీడియా కంపెనీ వైస్‌… ఢిల్లీ సీఎం జీవితం ఆధారంగా తెర‌కెక్కిన‌  చిత్రాన్ని విడుద‌ల చేయ‌నుంది. ఒక సామాజిక కార్య‌క‌ర్త స్థాయి నుంచి ఢిల్లీ ముఖ్య‌మంత్రిగా అర‌వింద్ కేజ్రీవాల్ ఎదిగిన తీరును ఆ చిత్రంలో చూపించ‌నున్నారు. ఆ చిత్రం పేరు ‘యాన్ ఇన్‌సిగ్నిఫికెంట్ మ్యాన్‌… అర‌వింద్ కేజ్రీవాల్’

మిమిసిస్ ల్యాబ్‌తో క‌లిసి వైస్ కంపెనీ ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నుంది. న‌వంబ‌ర్ 17న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా 22 దేశాల్లో విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి కుష్బూ రంకా, విన‌య్ శుక్లా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

విడుద‌ల‌కు స‌మ‌స్య‌లు

నిజానికి ఈ చిత్రం ఎప్పుడో సిద్ద‌మైంది. సిబిఎఫ్‌సి చీఫ్ పెహ్లాజ్ నిహ్లానీ ఈ సినిమాకి అడ్డంకులు క‌లిగించారు. ఈ సినిమా విడుద‌ల కావాలంటే ప్ర‌ధాని మోడీ అనుమ‌తి, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ అనుమ‌తి ఖ‌చ్చితంగా కావాల‌ని ష‌ర‌తు పెట్టారు. దాంతో చిత్రం విడుద‌ల‌కు నోచుకోలేదు. ప‌హ్లాజ్ నిహ్లానీ సిబిఎఫ్‌సి ప‌ద‌వి నుంచి వైదొల‌గ‌డంతో ఈ సినిమాకు అడ్డంకులు తొల‌గిపోయాయి.

ఫిల్మ్ స‌ర్టిఫికేష‌న్ అపిల్లేట్ ట్రిబ్యున‌ల్ కేజ్రీవాల్ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఒక్క క‌ట్ కూడా చెప్ప‌లేదు.