My title

ఇట్లా జరుగుతుందని చంద్రబాబుకు తెలియదా?

ఉపాధి హామీ పథకానికి కేంద్రప్రభుత్వం ఇచ్చిన నిధులను చంద్రబాబు ప్రభుత్వం దుర్వినియోగం చేసేసింది. అందుకే కేంద్రం అందించిన నిధులకు సంబంధించిన జమా ఖర్చులకు లెక్కలు కేంద్రప్రభుత్వ అధికారులకు చెప్పలేకపోయింది. దాంతో దేశంలోని అన్ని రాష్ట్రాలకు నిధులు అందించిన కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం మొండి చేయి చూపింది.

గతంలో ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్‌లు వచ్చినప్పుడు కేంద్రం నిధులు అందించింది. వాటిని ఎలా ఖర్చుపెట్టిందీ చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లెక్కచెప్పలేదు . దాంతో తరువాత వచ్చిన తుఫాన్‌లకు కేంద్రం నుంచి మనకు సాయం అందలేదు. చెన్త్నై, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతంలో వచ్చిన తుఫాన్‌కు దక్షిణాది జిల్లాల్లో, చెన్నైలో తీవ్ర నష్టం జరిగింది. చెన్నై కి రెండు రోజులలోగా సాయం అందించిన కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు మొండిచేయి చూపించింది. దానికి కారణం గతంలో ఇచ్చిన తుఫాన్‌ సాయానికి లెక్కలు చెప్పకపోవడమే.

అమరావతిలో రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులిచ్చింది. వాటిని ఎలా ఖర్చు చేసిందీ సరైన లెక్కలు చెప్పలేదు చంద్రబాబు ప్రభుత్వం. దాంతో మోడీ ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి కేంద్ర సాయాన్ని ఆపేశారు.

పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ ఇదే కథ.

ఈ దేశంలోనే అత్యంత సీనియర్‌ రాజకీయ నాయకుడినని,
దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన మొనగాడినని చెప్పుకునే చంద్రబాబు కేంద్ర సాయానికి లెక్కలు చెప్పకపోతే మళ్ళీ అక్కడినుంచి నిధులు రావన్న చిన్న లాజిక్‌ను ఎందుకు మిస్‌ అవుతున్నాడో అర్ధం కావడంలేదు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం చేస్తున్న తప్పులకు ఆంధ్రప్రదేశ్‌ దారుణంగా నష్టపోవడం బాధాకరం.