My title

వాళ్ల కోసమే.. ఇంతగా కష్టపడుతున్నా!

“నేను స్వీటీని అన్న విషయం.. నా సొంత మనుషులకు మాత్రమే తెలుసు. కానీ.. నన్ను, నా నటనను ప్రేమించి.. అభిమానించి.. ఇంతగా ఆరాధిస్తున్న వాళ్లను చూస్తుంటే.. నాకు బాధ్యతగా అనిపిస్తుంటుంది. అలాంటి వాళ్ల అభిమానాన్ని దూరం చేసుకోవద్దు అనుకుంటే.. మరింత కష్టపడి నటించాలని అనిపిస్తూ ఉంటుంది. అందుకే.. ప్రతి కేరెక్టర్ నూ.. ఇష్టపడి.. కష్టంతో చేస్తున్నా…” అంటోంది.. యోగా బ్యూటీ అనుష్క.

హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్ ఎక్కువగా చేస్తున్న విషయం స్పందిస్తూ.. ఇలాంటి అభిప్రాయం చేసిన అనుష్క.. ఓ దశలో.. తాను గ్లామర్ రోల్స్ కే లిమిట్ అవుదామని అనుకున్నట్టు చెప్పింది. కానీ.. కష్టపడే రోల్స్ చేయాలన్న ఆరాటం మళ్లీ పెరుగుతుండడంతో.. హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్ కూడా వరుసగా చేస్తున్నానని చెప్పింది.

గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నాం.. ఏదో నాలుగు కేరెక్టర్లు చేసుకుని వెళ్లిపోదాం అన్నట్టు కాకుండా.. చేసే పనిలో చిత్తశుద్ధి చూపించడమే కాదు.. అందుకు తగిన అవుట్ పుట్ ఇచ్చేందుకు ఆరాటపడుతున్న అనుష్కను.. ఆమె అభిప్రాయాలను అంతా ప్రశంసిస్తున్నారు. ఇలాగే.. కెరీర్ కొనసాగించాలని విష్ చేస్తున్నారు.