My title

ఈసారి జగన్ మెరుపులు, అధికార పార్టీ ఉరుములు లేనట్టే… 

త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్‌ జగన్‌ పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. ప్రభుత్వ వర్గాలు చెబుతున్న షెడ్యూల్‌ను బట్టి చూస్తే ఈసారి అసెంబ్లీలో జగన్‌కు, అధికార పార్టీకి మధ్య దాడులు, ఎదురుదాడులు ఉండకపోవచ్చు. నవంబర్‌ ఏడు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. రెండుమూడు రోజుల్లో అధికారికంగా షెడ్యూల్ విడుదలయ్యే చాన్స్ ఉంది. ఈసారి వారం నుంచి పది రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నారు.

అయితే నవంబర్ రెండు నుంచే జగన్‌ పాదయాత్ర మొదలవుతుంది.   కాబట్టి ఆయన అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు. నిజానికి ఈ నెలాఖరులోనే సమావేశాలు నిర్వహిస్తారని భావించారు. కానీ నవంబర్‌లో సమావేశాలు నిర్వహిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్‌ జగన్‌ అసెంబ్లీలో లేని పక్షంలో ఆయన స్థానంలో పార్టీ  సీనియర్‌ నాయకులు అసెంబ్లీ బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది.