My title

80 కోట్ల ట‌ర్నోవ‌ర్ సాధించినా…. కోటిన్న‌ర న‌ష్టం వ‌చ్చింది

బిజెపి అధ్య‌క్షుడు అమిత్ షా త‌న కుమారుడు కంపెనీల‌ వ్య‌వ‌హారంపై నోరు విప్పారు. జ‌య్ షాను వెన‌కేసుకొచ్చారు. జ‌య్ షా ఎటువంటి త‌ప్పిదాల‌కు పాల్ప‌డ‌లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మ‌నీలాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల‌ను కొట్టివేశారు.

బిజెపి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌య్ షా కంపెనీలు గ‌ణ‌నీయ‌మైన‌ లాభాల‌ను ఆర్జించాయని వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌లో వాస్త‌వం లేద‌ని అమిత్  షా అన్నారు. జ‌య్ షా ప్ర‌భుత్వం నుంచి ఎటువంటి ల‌బ్ధి పొంద‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

జ‌య్ షా ఎంతో ధైర్యం ప్ర‌ద‌ర్శించి ప‌రువు న‌ష్టం కేసును దాఖ‌లు చేశార‌ని అమిత్ షా అన్నారు. గ‌తంలో కాంగ్రెస్ అనేక అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న‌ప్ప‌టికీ ఒక్క‌సారి కూడా ఎవ‌రిపైనా ప‌రువున‌ష్టం దావా వేసే ధైర్యం చేయ‌లేద‌ని అమిత్ షా అన్నారు.

జ‌య్ షా కంపెనీ మొత్తంగా క‌మోడిటీ బిజెనెస్ అని ….అందులో టర్నోవ‌ర్ ఎక్కువగా ఉంటుందే గానీ లాభాలు అధికంగా ఉండ‌వ‌ని అమిత్ షా చెప్పారు.

జొన్న‌లు, స‌జ్జ‌లు, రైస్, ధ‌నియాల ఎగుమ‌తుల వ్యాపారంలో 80 కోట్ల ట‌ర్నోవ‌ర్ సాధించినా…కోటిన్న‌ర న‌ష్టం వ‌చ్చింద‌ని అమిత్ షా అన్నారు. అలాంట‌ప్పుడు మ‌నీ లాండ‌రింగ్ కు అవ‌కాశం ఎక్క‌డ‌ని ప్ర‌శ్నించారు.

వ్యాపార లావాదేవీల‌న్నీ చెక్కుల రూపంలో బ్యాంకుల ద్వారా జ‌రిగేవేనని అమిత్ షా తెలిపారు.