My title

వచ్చే నెల నుంచి బన్నీ సినిమా

డీజే వివాదాల నుంచి తొందరగా బయటపడాలని నిర్ణయించుకున్నాడు బన్నీ.  అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్ట్స్ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేయాలని ఫిక్స్ అయ్యాడు. నా పేరు సూర్య సినిమా ప్రారంభమైతే డీజేపై నడుస్తున్న వివాదాలు కాస్త చల్లారుతాయనేది బన్నీ ఫీలింగ్. అందుకే తాజాగా నా పేరు సూర్య సినిమాలో తన సరసన నటించనున్న హీరోయిన్ పేరును కూడా అఫీషియల్ గా ఎనౌన్స్ చేశాడు బన్నీ. అను  ఎమ్మాన్యుయేల్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నట్టు ప్రకటించాడు. ఇప్పుడు తాజాగా రెగ్యులర్ షూటింగ్ వివరాలు కూడా షేర్ చేస్తున్నాడు.

వచ్చేనెల మొదటి వారం నుంచి నాపేరు సూర్య సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ మూవీతో కథారచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. బన్నీ-అను ఎమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా కంప్లీట్ యాక్షన్ కథతో ఇది వస్తోంది. శరత్ కుమార్ ఇందులో విలన్ గా కనిపించనున్నాడు. మూవీ ప్రారంభోత్సవం రోజు శరత్ కుమార్ కూడా హాజరయ్యారు.

ఇక సినిమాలో మరో కీలకమైన పాత్ర కోసం అర్జున్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమాకు విశాల్-శేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఉత్తర భారతదేశంలోని కొన్ని కీలకమైన ప్రాంతాల్లో నా పేరు సూర్య సినిమా షూటింగ్ ప్రారంభమౌతుంది.