My title

అల్లరి నరేష్ దర్శకుడు.. హీరో ఎవరో!

అవును.. అల్లరి నరేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. హీరో ఎవరో మాత్రం చెప్పనంటున్నాడు. కాకపోతే.. రియల్ లైఫ్ లో కాదు. రీల్ లైఫ్ లో. మేడ మీద అబ్బాయి అంటూ.. తన కొత్త సినిమాను రెడీ చేసేస్తున్న అల్లరి నరేష్.. ఆ మూవీలో సినిమా డైరెక్టర్ కావాలనుకునే కేరెక్టర్ లో యాక్ట్ చేస్తున్నాడు. గతంలో.. ఇలాంటి స్టోరీతోనే.. ఏం మాయ చేశావె లాంటి సూపర్ హిట్ మూవీ వచ్చింది.

మరి.. ఆ సినిమాను ఇన్ స్పైర్ గా తీసుకుని కొత్త కథ రెడీ చేశారో లేక.. మరో కథతో అల్లరి నరేష్ తయారవుతున్నాడో తెలియదు కానీ.. కాన్సెప్ట్ తోనే.. కాన్ఫిడెన్స్ చూపించేస్తున్నాడు.. అల్లరోడు. నీలిమ సమర్పణలో బొమ్మన చంద్రశేఖర్ నిర్మాణంలో.. ప్రజిత్ దర్శకత్వంలో వస్తున్న మేడమీద అబ్బాయి.. రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ గా వస్తోందని చెబుతున్నాడు. టీజర్ కూడా.. రెండ్రోజుల్లో పది లక్షల మంది చూశారని చెప్పాడు.

మేడ మీది అబ్బాయి.. అందరి ఇంటి అబ్బాయిగా ఆదరణ పొందాలన్న అల్లరోడి కోరిక ఏమవుతుందో చూడాలి.