My title

“అర్జున్ రెడ్డి” కోసం పోటీ పడుతున్న ఇద్దరు హీరోయిన్లు

తెలుగులో సూపర్ హిట్ అయ్యి పెద్ద సంచలనం సాధించిన సినిమా “అర్జున్ రెడ్డి”. ఈ మూవీ రైట్స్ ఆల్రెడీ ఇతర బాషల ప్రొడ్యూసర్స్ కొన్నారు. అయితే ఈ మూవీ తమిళ రీమేక్ లో హీరోగా ఎవరు చేస్తారు అనే సస్పెన్స్ మొన్నటి వరకు ఉండేది. కాని రీసెంట్ గా విక్రం తన కొడుకు అయిన ధ్రువ్ ని హీరో గా “అర్జున్ రెడ్డి” రీమేక్ ద్వారా పరిచయం చేస్తున్నాను అని అధికారికంగా ప్రకటించేసాడు. ఇదిలా ఉంటే తమిళ్ “అర్జున్ రెడ్డి” ని తమిళ ప్రముఖ డైరెక్టర్ అయిన బాల డైరెక్ట్ చేయబోతున్నారు అనేది కూడా అనౌన్స్ చేసాడు. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి తమిళ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది.  ఇలా ఈ రీమేక్ మూవీ కి హీరో ఇంకా దర్శకుడు ఇద్దరూ సెట్టైపోవడంతో హీరోయిన్ ఎవరనే ప్రశ్న ఇప్పుడు ప్రేక్షకుల్లో ఊపందుకుంది.

ఇప్పుడున్న సమాచారం మేరకు ఈ మూవీలో ధ్రువ్ సరసన కమల్ హాసన్ రెండో కుమార్తె అయిన అక్షర హాసన్ నటించబోతుంది అనే వార్తలు వచ్చాయి. కాని ఈ న్యూస్ పై మూవీ యూనిట్ నుంచి గాని విక్రం నుంచి గాని ఎటువంటి న్యూస్ అందలేదు. అయితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ మూవీ లో అక్షర హాసన్ బదులు “నిర్మల కాన్వెంట్” ఫేమ్ శ్రియ శర్మ ని తీసుకుందాం అనే ఆలోచనల్లో ఉన్నారట టీం. మరి అక్షర హాసన్, శ్రియ శర్మలలో ఎవరు “అర్జున్ రెడ్డి” రీమేక్ లో నటించే అవకాశం సంపాదించుకుంటారో చూడాలి.