My title

ఫేస్‌బుక్ పేజీలు…. స్ట‌డీ టూర్ల పేరిట‌ పార్టీలు…. చాందిని హ‌త్య కేసులో షాకింగ్ కోణాలు

చాందిని హ‌త్య కేసులో క్లాస్‌మేటే హంత‌కుడు అని పోలీసులు నిర్ధారించారు. అయితే అత‌డు మైన‌ర్ కావ‌డంతో అతనిపేరును ప్ర‌స్తావించ‌లేదు. మీడియా ముందు చూపించ‌లేదు.  ఇటు ఈ కేసు విచార‌ణ‌లో పోలీసుల‌కు టీనేజ‌ర్లు ఎలా ప‌క్క‌దారి పడుతున్నార‌నే షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఒక ర‌కంగా ఈ నిజాలు చూసి పోలీసులు విస్తుపోయారు. చాందినితో పాటు పలువురు ఆమె క్లాస్‌మేట్స్ ఫేస్‌బుక్‌లో గ్రూపులు గా ఏర్ప‌డ్డారు. చాందిని ఏకంగా 150 గ్రూపుల్లో మెంబ‌ర్‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. నిండా 17 ఏళ్లు కూడా లేని చాందినికి సామాజిక మాధ్య‌మాలు ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగ‌మ్‌తో పాటు అన్నింట్లో అకౌంట్‌లు ఉన్నాయి. ఈ మాధ్య‌మాల్లో చాలా మంది అప‌రిచితుల‌తో ఆమె చాటింగ్ చేసిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది.

ఇటు హైక్లాస్ కార్పొరేట్ స్కూళ్ల‌లో చ‌దివే పిల్ల‌లు ఏవిధంగా చెడిపోతున్నార‌నేది మ‌రో ఉదాహ‌ర‌ణ బ‌య‌ట‌ప‌డింది. పేరెంట్స్‌ను పక్కదోవ పట్టించి చాందినితో పాటు ప‌లువురు విద్యార్థులు మూడు రోజుల పాటు హైద‌రాబాద్‌లోని ఓ హోట‌ల్‌లో గ‌డిపార‌ట‌. దాదాపు 52మంది విద్యార్ధిని విద్యార్ధులు మూడు రోజులు హైదరాబాద్ నడిబొడ్డులోని సెంట్రల్ కోర్టు హోటల్‌లో ఉన్నారు. నేషనల్ డిప్లమాటిక్ సమ్మిట్ పేరిట ఫేస్‌బుక్‌లో ఓ పేజీ  క్రియేట్ చేశారు. అందులో మెంబ‌ర్స్ అయిన 52 మంది స్టూడెంట్స్ ఈ హోట‌ల్‌లో మూడు రోజుల పాటు గ‌డిపారు. వీరంతా బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌కు చెందిన‌వారు.

ఆడ‌, మ‌గా క‌లిసి ఒకే రూమ్‌లో ఉండ‌డంతో పాటు…వీరికి లిక్క‌ర్ కూడా హోట‌ల్ య‌జ‌మాన్యం స‌ర‌ఫ‌రా చేసింద‌ని పోలీసులు తెలిపారు.సెంట్రల్ కోర్టు హోటల్‌లో మూడు రోజులు జల్సా చేసిన వారిలో చాందిని కూడా ఒకరు. ఆమె కాదు మిగతా విద్యార్ధులంతా అంతర్జాతీయ ప్రమాణాలున్న పాఠశాలల్లో చదువుతున్న వారే. ఇంట్లో స్ట‌డీ టూర్ పేరు చెప్పి వీరంతా సెప్టెంబ‌ర్‌1 నుంచి 3 వ‌ర‌కు ఈ హోట‌ల్‌లో బ‌స చేశార‌ని పోలీసుల విచార‌ణ‌లో చాందిని ఫ్రెండ్స్ ఒప్పుకున్నారు.  ఈ స‌మిట్‌లో ప‌రిచ‌య‌మైన సోహైల్ అనే స్టూడెంట్‌తో చాందిని క్లోజ్‌గా మూవ్ అయింద‌ని  సాయికిర‌ణ్ అనుమానించాడు. ఇక్క‌డ‌నే జ‌ల‌సీ పుట్టి ఆమెతో గొడ‌వ‌ప‌డ్డాడ‌ని…ఇదే కార‌ణంతో ఆమెను హ‌త‌మార్చి ఉంటాడ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్ప‌టికైనా పేరెంట్స్ త‌మ పిల్ల‌ల క‌ద‌లిక‌ల‌పై ఓ క‌న్నేసి ఉంచాల‌ని సైబ‌రాబాద్ క‌మిష‌న‌ర్ సందీప్ శాండిల్యా కోరారు.