My title

7 ల‌క్ష‌ల 51 వేల మంది లెక్చ‌ర‌ర్ల‌కు శుభవార్త

కేంద్ర ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు 7వ వేత‌న సంఘం సిఫార్సుల‌ను ఆమోదించింది. దీంతో దేశంలో వివిధ రాష్ట్ర యూనివ‌ర్సిటీలు, సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీల్లో ప‌నిచేస్తున్న ఏడున్న‌ర ల‌క్ష‌ల మంది లెక్చ‌ర‌ర్ల‌కు ల‌బ్ధి క‌ల‌గ‌నుంది.

వారి జీతం 22 నుంచి 28 శాతం పెర‌గ‌నుంది. కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ప్ర‌తిభ క‌ల‌వారిని అకాడ‌మిక్స్ వైపు ఆక‌ర్షించే విధంగా కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ నిర్ణ‌యం కార‌ణంగా ఏడు ల‌క్ష‌ల 51 వేల మందికి ఉప‌యోగం క‌ల‌గ‌నుంది.

దేశంలో కేంద్ర ప్ర‌భుత్వ నిధులు అందుకుంటున్న 119 టెక్నిక‌ల్ సంస్థ‌ల‌కు కూడా ఈ పెంపు వ‌ర్తించ‌నుంది. ఐఐటిలు, ఐఐఎంలు, ట్రిపుల్ ఐటిలు, ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌, ఐఐఎస్ఈఆర్‌, నిట్ త‌దిత‌ర సంస్థ‌లో పనిచేస్తున్న లెక్చ‌రర్లు… కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం కార‌ణంగా అద‌న‌పు జీతాన్ని పొంద‌నున్నారు.

భార‌త‌దేశంలో ఉన్న‌త విద్యారంగం బాగా వెన‌క‌బ‌డి ఉన్న కార‌ణంగా వాటిని ప‌టిష్ట‌ప‌రిచే విధానంలో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స్ఫ‌ష్టం అవుతోంది.

ఎక్కువ జీతాలు అందిస్తున్న ఐటి రంగం వైపు చాలా మంది ప‌రుగులు తీయ‌డంతో దేశంలో ఉన్న‌త చ‌దువుల‌కు నేటి యువ‌త ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌డం లేదు. రీసెర్చ్ విభాగం వైపు ఎవ‌రూ పెద్ద‌గా ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో కేంద్ర నిర్ణ‌యం నేటి యువ‌త ఆలోచ‌నా విధానంలో ఎటువంటి మార్పు తేనుందో రానున్న రోజుల్లో తేల‌నుంది.