My title

త‌మిళ‌నాడును ఒణికిస్తున్న డెంగ్యూ

త‌మిళ‌నాడులో ప్ర‌జ‌లు డెంగ్యూ దెబ్బ‌కు ఒణికిపోతున్నారు. ఒక్క‌సారిగా విజృంభించ‌డంతో రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప‌న్నీరుసెల్వం ప్ర‌ధాని మోడీని క‌లిసి ప‌రిస్థితి తీవ్ర‌త‌ను వివ‌రించారు. వెంట‌నే సాయం చేయాల‌ని కోరారు. ప‌రిస్థితిని అర్ధం చేసుకున్న ప్ర‌ధాని ప‌న్నీరు సెల్వానికి హామీ ఇచ్చారు. కేంద్ర బృందాల‌ను రాష్ట్రాల‌ను పంపుతామ‌ని చెప్పారు.

ప్ర‌ధాని ఆదేశాల మేర‌కు త‌మిళ‌నాడుకు ప్ర‌త్యేక వైద్య బృందాలు వ‌చ్చాయి. కేంద్ర ఆరోగ్య‌శాఖ పంపిన ఈ బృందాలు త‌మిళ‌నాడులో ప‌రిస్థితిని క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేయ‌నున్నాయి. డెంగ్యూ ప్ర‌బ‌ల‌డానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకుని మ‌రింత వ్యాప్తి చెంద‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు 40 మంది మృతి

త‌మిళ‌నాడులో డెంగ్యూ బారిన ప‌డి మ‌ర‌ణించిన వారి సంఖ్య 40 కి చేరింది. చ‌నిపోయిన వారిలో పిల్ల‌లు కూడా ఉన్నారు. కోయంబ‌త్తూర్‌లో ధ‌ర్మ‌పురానికి చెందిన అరుంధ‌తి అనే12 ఏళ్ల అమ్మాయి డెంగ్యూ కార‌ణంగా చ‌నిపోయింది. ఆ అమ్మాయి త‌ల్లిదండ్రుల రోద‌న రాష్ట్ర‌వ్యాప్తంగా కదిలించింది. రాష్ట్ర ప్ర‌జ‌ల‌ ప‌రిస్థితి తీవ్ర‌త‌ను తెలియ‌జేసింది.

మ‌ధురైలో ఎక్కువ‌గా డెంగ్యూ కేసులు న‌మోద‌య్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ 1268 మంది ఈ వ్యాధి బారిన ప‌డ్డారు.

రాష్ట్రం మొత్తం తీసుకుంటే అక్టోబ‌ర్ 9 వ‌ర‌కు 11,744 కేసులు న‌మోద‌య్యాయి.

2013 నుంచి 2016 వ‌ర‌కు త‌మిళ‌నాడులో స‌రాస‌రిన 4500 డెంగ్యూ కేసులు న‌మోద‌య్యాయి.

2012లో మొద‌టి సారిగా డెంగ్యూ త‌మిళ‌నాడులో విజృంభించింది. ఆ ఏడాది కూడా ఇప్ప‌టి లాగే ప్ర‌జ‌లు ఒణికిపోయారు. ఆ ఏడాది మొత్తంగా 13,204 కేసులు న‌మోద‌య్యాయి.

ఇమ్యూనిటీ త‌క్కువ ఉన్న వారిని ఈ డెంగ్యూ క‌బ‌ళిస్తున్న‌ట్లు అధికారులు తెలియ‌జేస్తున్నారు.

దోమ‌ల‌కు అనుకూలంగా ఉండే ప్రాంతాల‌ను త‌క్ష‌ణమే నిర్మూలించాల‌ని రాష్ట్ర వైద్యాధికారులు ప్ర‌జ‌ల‌కు సూచిస్తున్నారు. ప్ర‌జ‌ల్లో వ్యాధి ప‌ట్ల అవ‌గాహ‌న లేక పోవ‌డం కూడా వ్యాధి ప్ర‌బ‌ల‌డానికి కార‌ణ‌మ‌ని అధికారులు చెబుతున్నారు.

ప్ర‌భుత్వ ఆసుపత్రుల్లో స‌రిప‌డా సిబ్బంది లేక‌పోవ‌డం కూడా ఇప్పుడు స‌మ‌స్య‌గా మారింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వ‌చ్చిన వారు ఈ స‌మ‌స్య కార‌ణంగా మ‌రింత ఇబ్బందులకు గురౌతున్నారు.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో మంత్రులంద‌రూ త‌మ నియోజ‌క వ‌ర్గాల్లో బొప్పాయి ర‌సం కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ఈ ర‌సం తాగితే  డెంగ్యూ నుంచి బయటపడవచ్చని వారు ప్ర‌జ‌ల‌కు చెబుతున్నారు.