My title

35 కోట్లు వెన‌క్కి ఇచ్చేసిన సూప‌ర్ స్టార్‌

హిట్‌ల మీద హిట్‌లు కొట్టిన స‌ల్మాన్‌ఖాన్ కు ఈ మ‌ధ్య భారీ ప్లాప్ త‌గ‌లింది. క‌బీర్‌ఖాన్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ట్యూబ్‌లైట్ బాక్సాఫీసు ద‌గ్గ‌ర బోల్తాప‌డింది. డిస్టిబ్యూట‌ర్ల‌కు భారీ న‌ష్టాలు వ‌చ్చాయి. దీంతో వారంతా వెళ్లి స‌ల్మాన్‌ను క‌లిశార‌ట‌. వారిని ఆదుకుంటాన‌ని స‌ల్మాన్‌ఖాన్ హామీ ఇచ్చాడ‌ట‌. దీంతో త‌న ప్రామిస్‌లో భాగంగా 35 కోట్లను స‌ల్మాన్‌ఖాన్ వెన‌క్కి తిరిగి ఇచ్చాడు. శుక్ర‌వారం డిస్టిబ్యూట‌ర్ల‌ను పిలిచి 35 కోట్ల రూపాయ‌ల‌ను ఇచ్చేశాడు. ఈవిష‌యాన్ని ట్విట్ట‌ర్‌లో కోమ‌ల్‌నాథ్ అనే సినిమా ట్రేడ్ అన‌లిస్ట్ ప్ర‌క‌టించాడు. డిస్ట్రిబ్యూటర్‌ లు మొత్తం 70 కోట్ల రూపాయ‌లు కోల్పోయారు. ఇందులో ఇప్పుడు స‌ల్మాన్  స‌గం తిరిగి ఇచ్చేశాడు. రంజాన్ సంద‌ర్బంగా విడుద‌లైన సల్మాన్‌ఖాన్ ట్యూబ్‌లైట్ 21.15 కోట్ల రూపాయ‌ల‌తో ఓపెనింగ్స్ వ‌చ్చాయి. అయితే ఆర్వాత వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేక‌పోయింది. తొలివారంలో కేవ‌లం 64 కోట్లు రూపాయ‌లు మాత్ర‌మే క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. దీంతో భారీ డిజాస్ట‌ర్‌గా ఈ సినిమాను గుర్తించిన స‌ల్మాన్‌ఖాన్‌…అప్పుడే డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ప్రామిస్ చేశాడు. చెప్పిన‌ట్లుగానే స‌గం అమౌంట్ తిరిగి ఇచ్చేశాడు.