My title

ఎల్లుండి నుంచి మరో సినిమా

 

మహేష్ బాబు గ్యాప్ ఇవ్వడానికి అస్సలు ఇష్టపడడం లేదు. మొన్నటివరకు మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేసిన ఈ స్టార్ హీరో, వెంటనే కొరటాల శివ సినిమా సెట్స్ పైకి షిఫ్ట్ అవ్వబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. ఈరోజుతో మహేష్ బాబు నటిస్తున్న స్పైడర్ సినిమా టాకీ కంప్లీట్ అయిపోతుందట. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఎల్లుండి నుంచి కొరటాల శివ సినిమా సెట్స్ పై ప్రత్యక్షం కాబోతున్నాడు ప్రిన్స్.

డీవీవీ దానయ్య నిర్మాతగా కొరటాల, మహేష్ సినిమా ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. కాకపోతే మహేష్ మాత్రం ఇప్పటివరకు ఈ షూట్ లో జాయిన్ అవ్వలేదు. లండన్ లో షూటింగ్ ప్రారంభిద్దామని అప్పట్లో అనుకున్నప్పటికీ.. స్పైడర్ షెడ్యూల్స్ లేట్ అవ్వడంతో కొరటాల సినిమా కూడా లేట్ అవుతూ వచ్చింది.

ఎట్టకేలకు స్పైడర్ టాకీ కంప్లీట్ అవ్వడంతో ఎల్లుండి నుంచి కొరటాల దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు మహేష్. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాణి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు.