My title

ఆ కోరిక నెరవేర్చుకోలేకపోయా..!

150 సినిమాల ఘనమైన చరిత్ర… మెగాస్టార్ చిరంజీవి సొంతం. అలాంటి మెగాస్టార్ కు.. జీవితంలో ఓ తీరని కోరిక మిగిలిపోయింది. ఎప్పటికైనా.. భగత్ సింగ్ రోల్ చేయాలని చిరంజీవి చాలా కాలం పాటు కలగన్నారట. అదే టైమ్ లో.. తనతోటి హీరోలు చాలా మంది ఆ రోల్ ను చేసేసినా.. తను మాత్రం చేయలేకపోవడం.. జీవితాంతం ఓ లోటుగానే భావిస్తానని నిట్టూర్చారు… చిరు.

అంతటి మహా వీరుడి చరిత్రను కథగా తెరకెక్కించలేకపోయిన చిరు.. మరో మహాశూరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తెరకెక్కిస్తున్నాడు. బ్రిటిష్ వారి అరాచకాలను ఎదురించిన దక్షిణ భారత పోరాట యోధుడిగా నటిస్తున్నాడు. తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు.. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

భగత్ సింగ్ కేరెక్టర్ చేయలేదన్న లోటును.. ఉయ్యాలవాడతో ఇలా భర్తీ చేసుకుంటున్నాడు.