My title

రాకుమారి పెళ్లితోపాటు 190 పెళ్లిళ్లు

అబూదాభి రాకుమారుడు జనరల్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూతురికి షేక్ జాయెద్ బిన్ హందన్ జాయెద్ అల్ నహ్యాన్ పెళ్లి శుక్రవారం జరిగింది. ఈ పెళ్లి షేక్ ఖలీఆ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అధ్వర్యంలో అల్ ముషారిఫ్ రాజభవనంలో జరిగింది. ఈ పెళ్లికి రాజ కుటుంబ బంధువులతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి, అబూదాభి రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తోం హాజరయ్యారు. మంత్రులు, వివిధ దేశాల దౌత్యవేత్తలు కూడా హాజరయ్యారు. రాజకుటుంబంలో పెళ్లి జరిగిన సందర్భంగానే మరో 190 జంటల పెళ్లి కూడా జరిగింది.