My title

శాతకర్ణి గురించి బాహుబలి ఏమన్నాడంటే…

ఓ మంచి సినిమా వస్తే మెచ్చుకోకుండా ఉండలేడు దర్శకుడు రాజమౌళి. తన సినిమాతో పాటు ఇండస్ట్రీలోని అన్ని సినిమాలు ఆడాలని కోరుకునే కొద్దిమంది వ్యక్తుల్లో జక్కన్న కూడా ఒకడు. ఇప్పటికే ఖైదీ నంబర్ 150 సినిమాను ప్రత్యేకంగా మెచ్చుకున్న రాజమౌళి… తాజాగా గౌతమీపుత్ర శాతకర్ణిపై కూడా ట్వీట్ చేశాడు. సినిమా చాలా బాగుందని టోటల్ టీం ను అభినందించాడు.

సాహో బసవతారకపుత్ర బాలకృష్ణ అంటూ తన ప్రశంసల్ని ప్రారంభించిన రాజమౌళి… క్రిష్ టేకింగ్, 79 రోజుల్లో సినిమాను పూర్తిచేసిన క్రిష్ యాటిట్యూడ్ ను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. క్రిష్ నుంచి తను నేర్చుకోవాల్సింది చాలా ఉందని ట్వీట్ చేసిన జక్కన్న… మాటల రచయిత సాయిమాధవ్ బుుర్రాతో పాటు కెమెరామెన్, ప్రొడ్యూసర్ ను ప్రత్యేకంగా అభినందించాడు.

ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా పాజిటివ్ టాక్ తో ప్రారంభమైంది. బాలయ్య-శ్రియ జంటగా నటించిన ఈ సినిమాలో హేమమాలిని కీలక పాత్ర పోషించారు. బాలయ్య వందో చిత్రమిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 − sixteen =