My title

శర్వానంద్ సరసన నివేత థామస్ ?

రీసెంట్ గా “మహానుభావుడు” మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ కి రెడీ అవుతున్నాడు. ఈ మూవీ ని “స్వామి రా రా” ఫేం సుధీర్ వర్మ డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ లో ఉన్న ఈ మూవీ లో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలి అనే దాని పై టీం అంతా వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ లో శర్వానంద్ సరసన నివేత థామస్ ని హీరోయిన్ గా తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాని ఈ మూవీ లో ఇద్దరు హీరోయిన్స్ ని ప్లేస్ ఉందట. దాంట్లో మొదటి హీరోయిన్ గా నివేతని అనుకుంటున్నారు అని, రెండో హీరోయిన్ ని మాత్రం ఇంకా ఎవరిని అనుకోవట్లేదు అని తెలుస్తుంది. మరి రీసెంట్ గా “జై లవ కుశ” లో జూనియర్ ఎన్టీఆర్ తో ఆడి పాడిన నివేత థామస్ శర్వానంద్ పక్కన నటించడానికి ఓకే చెప్తుందా లేదా అనేది చూడాలి. ఒక్కసారి హీరోయిన్ ఫైనల్ అవ్వగానే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేసుకుంటుంది.