My title

శర్వానంద్ సంక్రాంతి సెంటిమెంట్

ఈరోజు నుంచి సంక్రాంతి ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. ఖైదీ సినిమా రికార్డు స్థాయిలో రిలీజైంది. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కూడా భారీగా విడుదల అవుతోంది. ఈ రెండు సినిమా తర్వాత లైన్ లో ఉన్నది శర్వానంద్ మాత్రమే. శతమానం భవతి సినిమాతో శర్వానంద్ మరోసారి సంక్రాంతి బరిలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. కేవలం రెండే రెండు సెంటిమెంట్స్ ఆధారంగా భారీ రిస్క్ చేస్తున్నాడు శర్వానంద్.

సెంటిమెంట్ – 1
సంక్రాంతికి ఫ్యామిలీ మూవీ ఏదో ఒకటి సందడి చేయడం ఆనవాయితీ. లాస్ట్ ఇయర్ పొంగల్ కు సోగ్గాడే చిన్ని నాయనా ఆ ట్యాగ్ దక్కించుకుంది. ఆమధ్య సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాకు కూడా ఇలాంటి ఇమేజే వచ్చింది. సో.. ఈసారి సంక్రాంతికి అలాంటి ఫ్యామిలీ మార్క్ ఇమేజ్ ఉన్న సినిమా శతమానం భవతి. కాబట్టి, ఫ్యామిలీ ఆడియన్స్ కచ్చితంగా తమ సినిమాకు వస్తారనేది నిర్మాత దిల్ రాజు ప్లాన్.

సెంటిమెంట్ -2
సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఘనత బాలయ్యది. నటసింహం కెరీర్ లో నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, లక్ష్మీనరసింహ లాంటి ఎన్నో సూపర్ హిట్స్ సంక్రాంతికి వచ్చినవే. కానీ, ఈమధ్య ఆ సెంటిమెంంట్ నుంచి కాస్త సైడ్ అయ్యాడు బాలయ్య. అయితే సేం టైం ఆ సెంటిమెంట్ ను శర్వానంద్ అందిపుచ్చుకున్నాడు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఎక్స్ ప్రెస్ రాజా సినిమాతో హిట్ కొట్టాడు. సో.. ఈసారి సంక్రాంతికి శతమానంభవతి మూవీతో సక్సెస్ గ్యారెంటీ అని సెంటిమెంటల్ గా ఫీల్ అవుతున్నాడు. ఈ రెండు సెంటిమెంట్లు శతమానం సినిమాకు ఏ మేరకు కలిసొస్తాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × 5 =