My title

వర్మతో సినిమా చేయాలని ఉందన్న స్టార్ హీరో

వరుస పరాజయాలతో డైరెక్టర్ గా డీలా పడుతున్న రామ్ గోపాల్ వర్మకు.. బంపర్ ఆఫర్ లాంటి పిలుపొచ్చింది. మలయాళంలోనే కాక.. కొద్ది కాలంగా అన్ని భాషల్లో అలరిస్తోన్న నటుడు, సూపర్ స్టార్ మోహన్ లాల్… వర్మతో సినిమా చేయాలని ఆరాటపడుతున్నాడు.

గతంలో వర్మ డైరెక్షన్ లోనే కంపెనీ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన లాల్.. ఇప్పుడు వర్మ డైరెక్షన్ లోనే మళ్లీ బాలీవుడ్ లో సత్తా చాటాలని అనుకుంటున్నాడు. అన్నీ కుదిరితే..వర్మతో మరో సినిమా చేసేందుకు తనకేం అభ్యంతరం లేదని ఓపెన్ గా చెప్పేశాడు.

చేయాలనుకుంటున్నట్టు.. మోహన్ లాల్ చెప్పేశాడు. ఇంక.. ఏం చేయాలన్నది.. రామ్ గోపాల్ వర్మ వంతు. ఎన్నాళ్లకు.. ఈ కాంబినేషన్ కుదురుతుందో మరి.