My title

వరుణ్ తేజ్ కెరీర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్

ఇంతకుముందు కంచె అనే సినిమా చేశాడు. అందరూ మెచ్చుకున్నారు ఆ సినిమాని. కానీ అది బ్లాక్ బస్టర్ కాదు. ఇంకా చెప్పాలంటే వరుణ్ తేజ్ కెరీర్ లో మొన్నటివరకు బ్లాక్ బస్టర్ అనే పదం లేదు. కానీ ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా మెగాహీరో అనిపించుకున్నాడు. అతడు నటించిన ఫిదా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. కాదు..కాదు.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఓవర్సీస్ లో మరో 48 గంటల్లో ఈ సినిమా 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటర్ అవుతోంది.

ఇక వరల్డ్ వైడ్ వసూళ్ల విషయానికొస్తే 2 వారాల్లో ఈ సినిమా 60కోట్ల రూపాయల గ్రాస్ సంపాందించింది. 34 కోట్ల 8లక్షల రూపాయల షేర్ వచ్చింది ఫిదా సినిమాకు. ఈ దెబ్బతో ఏడాది అనుభవిస్తున్న నష్టాల్ని ఒక్క దెబ్బతో భర్తీ చేసుకున్నాడు దిల్ రాజు.

శేఖర్ కమ్ముల బౌన్స్ బ్యాక్ అయ్యాడు ఫిదా సినిమాతో. ఈ సినిమా సక్సెస్ తో చాలామంది హీరోలు, మరెంతోమంది నిర్మాతలు అతడ్ని ఎప్రోచ్ అవుతున్నారు. సినిమా చేద్దాం అడ్వాన్స్ ఉంచండంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ కమ్ముల మాత్రం తనదైన స్టయిల్ లో మరో ఏడాది గ్యాప్ తీసుకోబోతున్నాడు.