My title

రేపట్నుంచే స్పైడర్ ప్రీమియర్స్

స్పైడర్ ప్రీమియర్ కు అమెరికాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏకంగా 3 వందలకు పైగా లొకేషన్లలో ఈ ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఇప్పటికే అన్ని లొకేషన్లలో అడ్వాన్స్ బుకింగ్స్ వంద శాతం కంప్లీట్ అయ్యాయి. భారతీయ కాలమానం ప్రకారం రేపు సాయంత్రం సరిగ్గా 4 గంటలకు అమెరికా అంతటా స్పైడర్ హంగామా మొదలవుతుంది.

బాహుబలి-2 తర్వాత అత్యథిక స్థాయిలో ప్రీమియర్స్ జరుపుకుంటున్న సినిమాగా స్పైడర్ రికార్డు సృష్టించింది. ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమాను 190 లొకేషన్లలో మాత్రం ప్రీమియర్స్ గా వేయగా.. స్పైడర్ కు ఏకంగా 3వందల లొకేషన్లు దక్కడం విశేషం. ఓవర్సీస్ లో మహేష్ కు ఉన్న స్టార్ డమ్, మురుగదాస్ కు ఉన్న క్రేజ్ కారణంగా స్పైడర్ కు ఇంత హైప్ వచ్చింది.

120 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన స్పైడర్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా విడుదల చేస్తున్నారు. జై లవకుశ సినిమాకు భారీగా థియేటర్లు కేటాయించినప్పటికీ.. బాక్సాఫీస్ బరిలో మరో మూవీ లేకపోవడంతో స్పైడర్ కు కూడా భారీ సంఖ్యలో థియేటర్లు దక్కాయి. ఎటొచ్చి హైదరాబాద్ లోనే ఎన్టీఆర్-మహేష్ మధ్య థియేటర్ల పోటీ కొనసాగుతోంది.