My title

రూమర్లను మరోసారి ఖండించిన బాహుబలి టీం

దాదాపు ఏడాది నుంచి పుకార్లకు క్లారిటీ ఇచ్చుకోవడంతోనే బాహుబలి టీంకు సరిపోతోంది. తాజాగా ఈ సినిమాపై మరోసారి రెగ్యులర్ గా వచ్చే పుకారే వచ్చింది. అయినప్పటికీ ఎలాంటి రూమర్లకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో టీం వెంటనే రియాక్ట్ అయింది. ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఈమధ్యే బాహుబలి-ది కంక్లూజన్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జోరుగా సాగుతోంది. అయితే గ్రాఫిక్స్ డిలే అవుతున్నాయనే వార్త బయటకు వచ్చింది. దీంతో చెప్పిన టైమ్ కు సినిమా వచ్చే ఛాన్స్ లేదంటూ కొన్ని వెబ్ సైట్స్ కథనాలు ప్రచురించాయి. దీంతో బాహుబలి టీం మరోసారి రంగంలోకి దిగింది. తమ సినిమా రిలీజ్ డేట్ ను మార్చే ఆలోచన లేదని స్పష్టంచేసింది. ఎట్టిపరిస్థితుల్లో సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 28న సినిమాను విడుదల చేసి తీరతామని తెలిపింది. ప్రభాస్-అనుష్క-తమన్న హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో రానా విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ ను అధికారికంగా ప్రారంభించబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eighteen + 2 =