My title

రవితేజ సినిమా రెడీ అవుతోందట..

మొన్నటివరకు అస్సలు సినిమానే ఎనౌన్స్ చేయలేదు. ఇంకా చెప్పాలంటే ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్నాడు. అలాంటి హీరో ఒక్కసారిగా 2 సినిమాలు స్టార్ట్ చేశాడు. కేవలం స్టార్ట్ చేయడమే కాదు, వాటిలో ఒక సినిమా షూటింగ్ ను క్లయిమాక్స్ కు కూడా తీసుకొచ్చాడు రవితేజ. అదే రాజా ది గ్రేట్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ను శరవేగంగా పూర్తిచేశాడు రవితేజ.

కేవలం సినిమాను పూర్తిచేయడమే కాదు, మరో 2 నెలల్లో రిలీజ్ కు రెడీ చేశాడు. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే సెప్టెంబర్ లో రాజా ది గ్రేట్ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నాడు. ఈ సినిమాలో రవితేజ కొంత భాగం అంధుడిగా కనిపించబోతున్న విషయం తెలిసిందే.

రాజా ది గ్రేట్ సినిమాను సెప్టెంబర్ లో కనుక విడుదలకు సిద్ధంచేస్తే పోటీ మరింత తీవ్రతరం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే సెప్టెంబర్ నెలను బాలయ్య రిజర్వ్ చేసుకున్నాడు. సెప్టెంబర్ 29న దసరా కానుకగా పైసా వసూల్ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించాడు. ఇక అదే నెలలో ఎన్టీఆర్ కూడా జై లవకుశ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు రవితేజ కూడా జాయిన్ అయితే సెప్టెంబర్ ప్యాక్ అయిపోయినట్టే.