My title

మా పార్టీలోకి వచ్చి పోటీ చేయమ‌నండి…

నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ పోటీ చేసి తీరుతుందన్నారు ఎమ్మెల్యే రోజా. చనిపోయిన వారి కుటుంబసభ్యులకే ఏకగ్రీవంగా సీటును వదిలేయాలన్న విలువలను మూడేళ్లుగా జగన్ పాటిస్తూనే ఉన్నారన్నారు. కానీ నంద్యాలలో పరిస్థితి వేరుగా ఉందన్నారు. నంద్యాల ఎమ్మెల్యే వైసీపీ నుంచి గెలిచారని కాబట్టి ఆ స్థానం వైసీపీకే దక్కాలన్నారు.

ఒకవేళ భూమా కుటుంబానికే ఏకగ్రీవంగా నంద్యాల స్థానం కట్టబెట్టాలంటే ఈ కుటుంబసభ్యులు వైసీపీ తరపున పోటీ చేయాలని రోజా సూచించారు. వైసీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్లి అక్కడ రాజీనామా చేసి తిరిగి గెలిచే ధైర్యం లేనివాళ్లు కూడా జగన్‌ను విమర్శిస్తే సహించబోమన్నారు.

తండ్రి చాటు బిడ్డగా భూమా అఖిలప్రియ గతంలో తప్పులు చేసి ఉండవచ్చని… కానీ ఇప్పుడు ఒక మంత్రిగా ఆమె హుందాగా వ్యవహరించాలన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలవాలని డిమాండ్ చేశారు. గతంలో శోభానాగిరెడ్డి వైసీపీలోకి వచ్చినప్పుడు నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేసి వైసీపీలోకివచ్చారన్నారు. ఇప్పుడు భూమా అఖిలప్రియ కూడా తన తల్లిలాగే నైతిక విలువలు పాటించాలన్నారు. నంద్యాల సీటు ముమ్మాటికి వైసీపీదేనని.. కాబట్టి అక్కడ పోటీ చేసి తీరుతామన్నారు.

లోకేష్ కామెడీ జబర్దస్త్ షోను మించిపోయిందన్నారు. రాష్ట్రంలో మంచినీరు లేకుండా చేస్తానని లోకేష్ చెప్పగానే హిందూపురంలో బాలకృష్ణ నిజం చేసి చూపించారన్నారు.